ఒక్కప్పుడు ప్రపంచానికి ఆండ్రాయిడ్ మొబైల్స్ అందించే కంపెనీల్లో HTC కంపెనీదే అగ్రస్థానం. రానురాను మొబైల్ ప్రపంచంలో పెరుగుతున్న పోటీని తట్టుకుని నిలబడడంలో HTC కంపెనీ ఫెయిల్ అయింది. దానితో దాదాపు ఆండ్రాయిడ్ మొబైల్ ప్రపంచం లో HTC ప్రస్థానం ముగిసిపోయింది అని అనుకున్నారు. కొన్ని నెలల క్రితం HTC కంపెనీ వైల్డ్ ఫైర్ R70 అనే బడ్జెట్ మొబైల్ ను విడుదల చేసింది. అయితే ఈ మొబైల్ అంత సక్సెస్ సాధించలేదు.
ఇప్పడు తాజాగా HTC డిజైర్ 20ప్రో అనే కొత్త మొబైల్ గీక్ బెంచ్ లో మెరిసింది. గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ సింగల్ కోర్ లో 312 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 1367స్కోర్ చేసింది.గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తుంది కానీ గీక్ బెంచ్ స్కోర్ ప్రకారం ఈ స్కోర్స్ మీడియా టెక్ జి80 మరియి సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9611 ప్రాసెసర్ గీక్ బెంచ్ స్కోర్స్ కి సమానంగా ఉన్నాయి. అలాగే గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ 6జీబీ రామ్ తో రానున్నట్లు తెలుస్తుంది. ఇంకా మొబైల్ ఫ్రంట్ డిజైన్ వన్ ప్లస్ 8 మరియు బ్యాక్ డిజైన్ మీ 10 మొబైల్ ను పోలివున్నట్లు సమాచారం.ఈ మొత్తం లీక్స్ LlabTooFeR అనే ట్వీటర్ అకౌంట్ ద్వారా నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. చూద్దాం ఏ సారైనా HTC కంపెనీ తన పూర్వ వైభవాన్ని పొందుతుందో లేదో….
Comments
Post a Comment