మీ నోట్ 10లైట్ మరియు పోకో F2 మొబైల్స్ యూరోప్ లో మే నెలలో విడుదల కాబోతున్నట్లు ప్రఖ్యాత చైనా లీక్ స్టార్ Xiaomishka తన ట్వీటర్ అకౌంట్ ద్వారా లీక్ చేసాడు.
మీ నోట్ 10లైట్ ఇప్పటికే థాయిలాండ్ లో M2002F4LG అనే మోడల్ నెంబర్ తో NBTC సర్టిఫికేషన్ పొందింది. ఇంకా లీక్స్ ప్రకారం ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 730జి ప్రాసెసర్, 6.47ఇంచ్ ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ,ఇండిస్ప్లేయ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉండబోతుంది. బ్యాక్ 64+8+8+5+2 ఎంపీ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 16ఎంపీ కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్ 5,260mAh కెపాసిటీ కలిగిన బాటరీ మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
ఇంకా పోకో F2 ఇప్పటికే IMEI డేటా బేస్ లో M2004J11G అనే మోడల్ నెంబర్ తో కనిపించింది. ఇప్పడు తాజా లీక్స్ ప్రకారం ఈ మొబైల్ చైనా లో విడుదలైన రెడీమి కే30ప్రో స్పెసిఫికేషన్స్ తో గ్లోబల్ గా విడుదల కానున్నట్లు సమాచారం ఐతే గ్లోబల్ గా విడుదలయ్యె మొబైల్ 5జి సపోర్ట్ లేకుండా విడుదల కానున్నట్లు సమాచారం. అంతే కాకుండా M2003J6C1 అనే మోడల్ నెంబర్ తో ఇండియా లో పోకో కంపెనీ ఇంకో మొబైల్ ను విడుదల చేయనున్నది. అయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు.
Comments
Post a Comment