ప్రస్తుతం ఇండియా లో లాక్ డౌన్ నడుస్తుంది. ఈ సమయం లో మన ఇంటిలో చిన్న పిల్లలు మనల్ని బయటకి వెళ్తాము అంటూ కొంచెం ఇబ్బంది పెడుతూవుంటారు. వారి కోసం కొత్త గేమ్స్ మరియు పజిల్స్ ను వెతుకుతూ ఉంటాము. అట్లాంటివాటిలో గూగుల్ 3డి యానిమల్స్ అనే ఫీచర్ బాగా ఉపయోగాపడుతుంది.ఈ ఫీచర్ AR(ఆగ్మెంటేడ్ రియాలిటీ) ఫీచర్ సహాయంతో పనిచేస్తుంది. దీని ద్వారా యానిమల్స్ ను మన చుట్టూ వున్నా ప్రాంతాల్లో మనకు నచ్చిన విధంగా చూడవచ్చు. అంతే కాకుండా వాటిని మనం ఫోటో లేదా వీడియో కూడా తీసుకోవచ్చు.
ఈ ఫీచర్ మొబైల్స్ పైన మాత్రమే పనిచేస్తుంది. డెస్క్ టాప్ మరియు లాప్ టాప్ వంటి వాటిలో పనిచేయదు. ఇంకా మొబైల్స్ లో ఆండ్రాయిడ్ 7.0 మరియు ఐ ఓస్ 11.0 కన్నా పై ఓస్ వెర్షన్ లను కలిగి వున్నా మొబైల్స్ లో మాత్రమే పనిచేస్తుంది. alligator, cat, cheetah, bear, dog, duck, eagle, angler fish, goat, panda, horse, lion, octopus, racoon వంటి యానిమల్స్ ను 3డి చూడవచ్చు.
గూగుల్ 3డి యానిమల్స్ ను పొందాలంటే:
1. మొదటగా పై యానిమల్స్ లో ఒక దాని పేరు ను గూగుల్ సెర్చ్ లో వెతకాలి.
2.సెర్చ్ రిజల్ట్స్ లో “Meet a life-sized tiger up close” and a “View in 3D” button. అనే దాని సెలెక్ట్ చేసుకోవాలి.
3.ఇప్పడు “View in 3D” ని క్లిక్ చెయ్యడం ద్వారా మనం యానిమల్స్ ను 3డి లో చూడవచ్చు.
4. తరువాత లోపలకి వెళ్తారు. అక్కడ animal కింద view in your space అని ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.
4.1- అయితే క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ కెమెరా కి సంబంధించిన పెర్మిషన్స్ ఇవ్వడం అలాగే కెమెరా ను మనం వున్నా ప్రాంతం లో ఒకసారి టిల్ట్ చేయడం ద్వారా ద్వారా యానిమల్స్ ను 3డి లో చూడవచ్చు.
4.2- నా మొబైల్ లో view in your space అని ఆప్షన్ కనిపించడం లేదు. ఒక వేళ మీకు ఆ ఆప్షన్ వస్తే నేే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది.
4.3 – ఈ ఆప్షన్ కోన్ని మొబైల్స్ లో మాత్రమే వస్తుంది. ఒక సారి మీ మొబైల్ లో వస్తుందో లేదో చెక్ చేసుకోగలరు.
5. 3డి లో కనిపించిన యానిమల్స్ మనం మనకు నచ్చిన విధంగా అడ్జెస్ట్ చేసుకుని ఫోటో లేదా వీడియో కూడా తీసుకోవచ్చు.
Comments
Post a Comment