విమానం లో wifi రాబోతుంది

విమానం లో wifi రాబోతుంది : మనం విమానంలో ఎక్కితే ఖచ్చితంగా మన మొబైల్స్ ని aeroplane మోడ్ లో కానీ, స్విచ్ ఆఫ్ గాని చేసుకొని పెట్టుకోవాలి. విమానం లో ఇంటర్ నెట్ వాడుకోవడానికి ఉండదు. ఇక నుంచి విమానం లో కూడా వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. మన ఇండియా లో మొదట ఈ సర్వీస్ ని vistara ( విస్తార ) కంపెనీ వాళ్ళు తీసుకుకొని రాబోతున్నారు.

దీని కోసం వీళ్లు టాటా గ్రూప్ కి చెందిన Nelco సంస్థ తో మరియు Panasonic Avionics సంస్థ తో కలవబోతుంది. ఈ సంస్థ లతో కలిసి ఈ వైఫై సేవలను తీసుకు రానుంది. ఈ సర్వీస్ కోసం ఇస్రో కి చెందిన GSAT-14 satellite ని ఉపయోగించుకోబోతున్నారు.ఈ సర్వీస్ ని మార్చి – ఏప్రిల్ నెలల నుంచి అందుబాటులో కి రాబోతున్నాయి. 

వైఫై సర్వీస్ లో మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నారు. మొదట భాగం లో కేవలం whatsapp ని చూసుకోవడానికి , 2 వ భాగం యూట్యూబ్ లాంటి యాప్స్ ని చూసుకోవడానికి, 3 వ భాగం netflix లాంటి OTT యాప్స్ ని చూసుకోవడానికి ఈ వైఫై ని మనం వాడుకోవచ్చు. 

ఈ వైఫై సేవలకు ఎంత డబ్బులు తీసుకుంటారో ఇంకా తెలియదు, ప్రస్తుతం ఈ సర్వీస్ ని domestic flight కి అందుబాటులో కి తీసుకురాబోతున్నారు. ఇండియా ప్రజలను దృష్టిలో ఉంచుకుని వైఫై ప్లాన్స్ రేట్స్ ఉంటాయి అని విస్తార సంస్థ చోబుతుంది.

Comments