మొబైల్ ప్రపంచం లో షియోమీ UI అయిన MIUI కి చాలా మంది అభిమానులు అలాగే ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఎన్నో ఫీచర్స్ ను షియోమీ కంపెనీ అందిస్తుంది. ఇప్పుడు షియోమీ ఒక కొత్త ఫీచర్ ను MIUI లో టెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ పేరు “App Behavior Records” అని తెలుస్తుంది.
సాధారణంగా మనం ఏదయినా యాప్స్ ను వాడుతున్నపుడు ఆ యాప్ లొకేషన్ , కాంటాక్ట్స్ ,కాల్స్ వంటి కోసం పెర్మిషన్స్ అడుగుతుంటాయి. అలాగే మనకు తెలియకుండా కొన్ని యాప్స్ మనకు సంబంధించిన సమాచారాన్ని ను వాడుకోవడం లేదా స్టోర్ చేసుకుంటాయి. ఇట్లాంటి పనులను ఈ ఫీచర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యూజర్ కి తెలియచేస్తుంది.ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే వుంది. ఫ్యూచర్ లో ఈ ఫీచర్ MIUI లో అందరికి అందుబాటులోకి వస్తుంది.
1.బ్యాక్ గ్రౌండ్ లో ఆడియో రికార్డింగ్
2. క్యాలెండరు ఈవెంట్స్ వాడుకోవడం
3.కాల్ హిస్టరీ ను యూజ్ చేయడం
4. ఫోన్ కాల్ చేయడం
5. ఫొటోస్ తీయడం లేదా వీడియోస్ రికార్డు చేయడం
6. క్లిప్ బోర్డ్ ను వాడడం
7. కాంటాక్ట్స్ యూజ్ చేయడం
8.లొకేషన్ ఇన్ఫర్మేషన్
9. టెక్స్ట్ మెస్సేజెస్ చదవడం
10.సెన్సార్ డేటా
11. ఫోన్ ఆక్టివిటీ ఇన్ఫర్మేషన్
12.మొబైల్ ఇన్ఫర్మేషన్
13.ఫోన్ నెంబర్ తెలుసుకోవడం
14.మొబైల్ లో వున్నా ఫైల్స్ ను వాడుకోవడం
పై తెలిపిన పనులను ఈ ఫీచర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ,ఏ యాప్ ఎలా వాడుతున్నాయి మొదలుగున్న విషయాలను యూజర్ కు తెలియపరుస్తుంది.
Comments
Post a Comment