రియల్ మీ 5i సక్సెసోర్ రియల్ మీ 6i FCC సర్టిఫికేషన్ పొందింది. ఇప్పటికే ఈ మొబైల్ ఇండియా, రష్యా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో వైఫై సర్టిఫికేషన్ పొందింది.
ఈ మొబైల్ RMX2040 అనే మోడల్ నెంబర్ తో FCC సర్టిఫికేషన్పొందింది. FCC సర్టిఫికేషన్ ప్రకారం ఈ మొబైల్ వాటర్ డ్రాప్ డిజైన్ తో మరియు బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్ తో రానున్నది. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో ప్రైమరీ కెమెరా 48ఎంపీ కెమెరా అని తెలుస్తుంది.అలాగే ఈ మొబైల్ కి సంబంధించిన ఛార్జర్ కూడా ఈ సర్టిఫికేషన్ లో కనిపించింది. దీని ప్రకారం ఈ మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో పాటు 18W ఫాస్ట్ చార్జర్ తో రానున్నట్లు తెలుస్తుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలిసి ఉంది. త్వరలోనే రియల్ మీ కంపెనీ నుంచి తక్కువ బడ్జెట్ లో ఈ మొబైల్ మార్కెట్ లోకి రావచ్చు.
Comments
Post a Comment