కరోన దెబ్బకు Apple వేరే దేశానికి వెళ్ళింది : కరోన వైరస్ దెబ్బ మనుషుల పైన కాకుండ చాలా రంగాల పైన ప్రభావం చూపుతుంది, అందులో టెక్నాలజీ ఒకటి. ఈ కరోన వైరస్ దెబ్బకి మొబైల్ కంపెనీలు చాలా వరుకు నష్ట పోతున్నాయి. మొబైల్స్ మార్కెట్ అంటే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది చైనా, ఎందుకంటే చాలా మొబైల్స్ కంపెనీల యొక్క పరిశ్రమలు ఆ దేశం లొనే ఉన్నాయి. అందులో apple కంపెనీ కూడా ఒకటి. ఈ కరోన దెబ్బకి apple తన ప్రొడక్షన్ ని చైనా నుంచి తైవాన్ కి మార్చింది.
Apple గాడ్జెట్స్ అయిన AirPods Pro Lite, iPads మరియు Apple Watches మరి కొన్ని ఆపిల్ కి సంబంధించిన వస్తువుల ను ఇప్పుడు తైవాన్ లో తయారు చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు apple పూర్తి చేసింది. మరి మొబైల్స్ ని ఈ తైవాన్ లో తయారు చేస్తారో లేదో అన్న దాని పైన ఎలాంటి సమాచారం లేదు.
ఈ కరోన వైరస్ వల్ల ఎక్కువ శాతం huawei కంపెనీ కి ఎక్కువ నష్టం వచ్చింది అని వార్తలు వస్తున్నాయి, ఈ కంపెనీ తో పాటు వివో, ఒప్పో కంపెనీ లకు కూడా చాలా నష్టం వచ్చింది. ఈ covid 2019 ( కరోన) వైరస్ దెబ్బకి చైనా లో ఎవరు Offline లో మొబైల్ కొనడానికి రావడం లేదు.
Comments
Post a Comment