కొత్త 5జి మోడెమ్ ను విడుదల చేసిన క్వాలకమ్

2020లో ప్రతి మొబైల్ కంపెనీ 5జి మొబైల్స్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అలాగే 5జి అవసరాలకు తగ్గట్లుగా క్వాలకమ్ కంపెనీ కూడా 5జి మోడెమ్స్ ను విడుదల చేస్తుంది. ఇప్పుడు క్వాలకమ్ కంపెనీ X55 మోడెమ్ సక్సెసోర్ X60 మోడెమ్ ను విడుదల చేసింది.

ఈ మోడెమ్ లో 5nm టెక్నాలజీ తో కూడిన నోడ్ ఉపయోగించారు. అలాగే ఈ మోడెమ్ 4జి LTE తో పాటు 3జి మరియు 2జి లనుకూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మోడెమ్ గరిష్టంగా 7.5జీబీపీస్ డౌన్ లోడ్ మరియు 3జీబీపీస్ అప్ లోడ్ స్పీడ్ ను అందిస్తుంది. ఈ మోడెమ్ అన్ని రకాల 5జి మోడ్స్ మరియు బాండ్స్ ను సపోర్ట్ చేస్తుంది. 2021లో వచ్చే అన్ని రకాల ఫ్లాగ్ షిప్ మొబైల్స్ లో మనం ఈ మోడెమ్ ను చూడవచ్చు.

Comments