ఇండియా లో 29999/-రూపాయలకు విడుదలైన సామ్ సుంగ్ గాలక్సీ A71

సామ్ సుంగ్ కంపెనీ 2019 డిసెంబర్ లో “A” సిరీస్ లో భాగంగా A50 మరియు A70 మొబైల్ సక్సెసోర్ లైన A51 మరియు A71 గ్లోబల్ గా విడుదల చేసింది. ఇంకా ఇండియా విషయానికొచ్చేసరికి జనవరి 2020లో A51 మొబైల్ ను 23999/-లకు విడుదల చేసింది. ఇప్పడు A71 మొబైల్ ను కూడా ఇండియా లో రూపాయలకు విడుదల చేసింది.

ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చుస్తే ఈ మొబైల్ 6.7ఇంచ్ ఇన్ఫినిటీ “O” తో కూడిన డిజైన్ మరియు సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 730ప్రాసెసర్ తో మరియు 6+128,8+128జీబీ స్టోరేజ్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇంకా బ్యాక్ 64ఎంపీ ప్రైమరీ కెమెరా +12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా +5ఎంపీ డెప్త్ కెమెరా +5ఎంపీ మాక్రో కెమెరా తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 32ఎంపీ కెమెరా లను కలిగి వుంది. ఈ మొబైల్ ప్రిజమ్ క్రష్ బ్లాక్, బ్లాక్ ,బ్లూ,కలర్స్ లో లభిస్తుంది.

 

సామ్ సుంగ్ గాలక్సీ A71 స్పెసిఫికేషన్స్:
1.6.7ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇన్ఫినిటీ “O” డిజైన్ తో
2. స్నాప్ డ్రాగన్ 730ప్రాసెసర్ తో మరియు అడ్రెనో 618GPU
3. 8+128జీబీ స్టోరేజ్ వేరియంట్ మరియు 512జీబీ వరకు ఎక్సపండబుల్ మెమరీ
4.64+12+5+5ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ (ప్రైమరీ+అల్ట్రా వైడ్+మాక్రో+డెప్త్)
5.ఫ్రంట్ 32ఎంపీ కెమెరా
6.ఆండ్రాయిడ్ 10 సామ్ సుంగ్ వన్ UI 2.0తో
7.4500mAh బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ తో
8.టైపు సి పోర్ట్ ,బ్లూ టూత్ వెర్షన్ 5.0, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఈ మొబైల్ ఇండియా లో 29999/-లకు ఫిబ్రవరి 24 నుండి అన్ని రిటైల్ స్టోర్స్ మరియు ఆన్ లైన్ లో సేల్ కి రానున్నది.

Comments