WhatsApp Dark Theme వచ్చేస్తుంది : WhatsApp ఉపయోగించే వాళ్ళు వాట్సాప్ డార్క్ మోడ్ అప్డేట్ కోసం చాలా కాలం నుంచి wait చేస్తున్నారు.
ఫైనల్ గా వాట్సాప్ గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ లో whats app 2.20.13 వెర్షన్ ని అప్డేట్ చేసింది. వాట్సాప్ బీటా వెర్షన్ వాడుతున్న వాళ్ళకి ఈ డార్క్ మోడ్ అప్డేట్ వస్తుంది.
బీటా వెర్షన్ డార్క్ మోడ్ వాడుతున్న యూజర్లు కి ఎలాంటి ఇబ్బందులు రాకపోతే, అతి త్వరలో ఈ అప్డేట్ స్టేబుల్ వెర్షన్ యూజర్లు కి వస్తుంది. ఎప్పటి నుంచో డార్క్ థీమ్ కోసం wait చేస్తున్న వాళ్లకి ఇది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు.
డార్క్ మోడ్ వాట్సాప్ లో ఎక్కడ ఉంటుంది :
WhatsApp Settings > Chats > లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఇలా ఉంటుంది ( పైన ఫోటో చూడండి ) > వీటిలో మీరు డార్క్ మోడ్ ని సెలెట్ చేసుకోవచ్చు.
నోట్ : మీరు బీటా వెర్షన్ వాడుతున్న డార్క్ మోడ్ అప్డేట్ రాకపోతే, ఒక సారి యాప్ ని uninstall చేసి install చేయండి.
Comments
Post a Comment