ఒప్పో FIND X2 లీకెడ్ స్పెసిఫికేషన్స్

ఒప్పో కంపెనీ ఫ్లాగ్ షిప్ మరియు కాన్సెప్ట్ మొబైల్ అయిన FIND X మొబైల్ కి సక్సెసోర్ FIND X2 ను ఒప్పో కంపెనీ త్వరలోనే విడుదల చేయనున్నది. ఇప్పుడు ఈ మొబైల్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి ముఖ్యంగా కెమెరా కు సంబందించినవి.

ఇప్పటి వరకు లీక్స్ ప్రకారం ఒప్పో FIND X2 6.5ఇంచ్ క్వాడ్ HD+ అమోల్డ్ డిస్ప్లే లో 120Hz రిఫ్రెష్ రేట్ తో రానున్నది. అంతే కాకుండా ఈ మొబైల్ లో MEMC అనే స్క్రీన్ టెక్నాలజీ వాడుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఈ MEMC టెక్నాలజీ హై ఎండ్ టీవీ లో వాడుతారు. అలాగే 80డిగ్రీ SCREEN ఎడ్జెస్ తో రానున్నది. అంతే కాకుండా లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో M1 అనే అనుబంధ ప్రాసెసర్(COPROCESSOR)తో రానున్నది. ఈ M1 ప్రాసెసర్ ను ఒప్పో కంపెనీ సొంత డెవలప్ చేసింది. ఈ M1 ప్రాసెసర్ 865ప్రాసెసర్ కి కొంత భారం తగ్గిస్తుంది అని లీక్స్ ద్వారా తెలుస్తుంది.

ఇంకా కెమెరా లో ఒక కొత్త ఇమేజ్ సెన్సార్ అంటే సోనీ IMX689 అనే 48ఎంపీ కెమెరా తో రానున్నట్లు సమాచారం. ఇంకా IMX708 సెన్సార్ తో అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా మరియు 13ఎంపీ టెలి ఫోటో లెన్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. ఈ టెలి ఫోటో కెమెరా ను ఉపయోగించి 5X హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ చేయవచ్చు.ఇంకా ఫ్రంట్ IMX616 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.ఈ స్పెసిఫికేషన్స్ చూస్తుంటే ఒప్పో కంపెనీ ఒక కొత్త రకం మరియు అద్భుతమైన కెమెరా కలిగిన మొబైల్ తీసుకురానుట్లు తెలుస్తుంది.

Comments