నోకియా ఫ్లాగ్ షిప్ మొబైల్ నోకియా 9 ప్యూర్ వ్యూ 2019 లో విడుదల అయింది. ప్రపంచం లో మొదటిసారిగా పెంటా(5) బ్యాక్ కెమెరా లతో విడుదల అయినా మొబైల్ నోకియా 9 ప్యూర్ వ్యూ. ఈ మొబైల్ అంతగా సక్సెస్ కాలేదు. పాత ప్రాసెసర్ (స్నాప్ డ్రాగన్ 845), ధర ఎక్కువ ,కెమెరా లను ఆప్టిమైజషన్ వంటి పలు కారణాల వల్ల ఈ మొబైల్ అంత సక్సెస్ కాలేదు. అలాగే ఈ మొబైల్ విడుదల సమయం లో ఈ మొబైల్ ను స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ తో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పుడు ఆ ప్లాన్ ను విరమించుకున్నట్లు సమాచారం.
2020 లో నోకియా 9ప్యూర్ వ్యూ సక్సెసోర్ నోకియా 9.2 మొబైల్ ను 2020ప్రథమార్ధం లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ అలాగే లైట్ కెమెరా టెక్నాలజీ తో కాకుండా మాములు టెక్నాలజీ తో రానున్నట్లు సమాచారం. అంతే కాకుండా నోకియా 8 మొబైల్ లాగా తక్కువ ధర లో ఈ మొబైల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇండియా లో నోకియా 8 మొబైల్ ను 30కే రూపాయల లోపు తీసుకొచ్చారు. ఇప్పడు నోకియా 9.2 కూడా ఇలానే వస్తే సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ వున్నాయి. చూద్దాం ఎంత ధరలో మరియు ఏ స్పెసిఫికేషన్స్ తో తీసుకొస్తారో….
Comments
Post a Comment