48ఎంపీ కెమెరా తో రానున్న సామ్ సుంగ్ గాలక్సీ A31 మరియు A41

సామ్ సుంగ్ 2019 లో విడుదల చేసిన ” A ” సిరీస్ మొబైల్స్ ఎంతో ఆదరణ పొందాయి. ఇంకా 2020 సంవత్సరంపు “A” సిరీస్ లో భాగంగా ఇప్పటికే సామ్ సుంగ్ A51 మరియు A71 మొబైల్స్ ను గ్లోబల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు A31 మరియు A41 మొబైల్స్ కెమెరా కి సంబంధించిన లీక్స్ బయటకి వచ్చాయి.

ఈ లీక్స్ ప్రకారం A31 మొబైల్ బ్యాక్ 48ఎంపీ కెమెరా తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 25ఎంపీ కెమెరా తో రానున్నది. ఇంకా బ్యాక్ రెండో కెమెరా 5ఎంపీ మాక్రో కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే 5000mAh బ్యాటరీ తో రానున్నది.

ఇంకా A41లో బ్యాక్ 48ఎంపీ కెమెరా తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 25ఎంపీ కెమెరా తో రానున్నది. మిగిలిన రెండు కెమెరా లకు సంబంధించిన సమాచారం తెలియాలిసివుంది. ఇంకా A41లో 3500mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తుంది.

ఈ రెండు మొబైల్స్ కూడా 4జీబీ రామ్ మరియు 64/128జీబీ స్టోరేజ్ మోడల్స్ లో అలాగే సామ్ సుంగ్ ఎక్సీనోస్ ప్రాసెసర్ తో అలాగే మైక్రో SD కార్డు సపోర్ట్ కూడా తో రానున్నట్లు తెలుస్తుంది.

Comments