ఇండియా లో పోకో F1 కి వున్నా డిమాండ్ అంత ఇంత కాదు. ఇప్పటికే పోకో మొబైల్ షియోమీ నుండి విడిపోయి సొంతగా మొబైల్స్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పడు పోకో కొత్త మొబైల్ అంటే X2 విడుదల కి సంబంధించిన టీజర్స్ సోషల్ మీడియా లో చాలా హడావిడి చేసాయి.
ఇప్పుడు పోకో X2 మొబైల్ ఫిబ్రవరి 4 ను విడుదల కానున్నట్లు తెలుస్తుంది. కొద్దీ రోజుల క్రితం “phoenixin” పేరు తో ఈ మొబైల్ గీక్ బెంచ్ లో మెరిసింది. ఈ మొబైల్ గీక్ బెంచ్ లో సింగల్ కోర్ లో 547 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 1767 స్కోర్ చేసింది. అలాగే గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ 8జీబీ రామ్ మరియు ఆండ్రాయిడ్ 10తో రానున్నది. కొత్త టీజర్స్ ప్రకారం ఈ మొబైల్ సోనీ లేటెస్ట్ కెమెరా సెన్సార్ IMX686 అంటే 64ఎంపీ కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ , లిక్విడ్ కూలింగ్ , ఎల్సిడి డిస్ప్లే తో రానున్నట్లు తెలుస్తుంది. చాలా మంది చైనా లో విడుదల చేసిన రెడీమి K30 4జి మోడల్ మొబైల్ ను ఇండియా లో పోకో X2 విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి ఇండియా లో K30 4జి స్పెసిఫికేషన్స్ తో విడుదల చేస్తోరో లేదా కొత్త స్పెసిఫికేషన్స్ తో విడుదల చేస్తారో కొద్దీ రోజులో తెలుస్తుంది.
Comments
Post a Comment