జనవరి లో విడుదల కానున్న ఒప్పో F15

ఇండియా లో ఒప్పో F11 సిరీస్ ఫోన్స్ ఎంతో సక్సెస్ సాధించాయి. ఇప్పుడు వీటి సక్సెసోర్ F15 త్వరలోనే అంటే జనవరి 2020లో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన టీజర్స్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా F సిరీస్ మొబైల్స్ ఆఫ్ లైన్ బేస్డ్ మొబైల్స్ అందువల్ల ఈ మొబైల్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఈ మొబైల్ పాత మీడియా టెక్ హీలియో P70ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఈ సూపర్ అమోల్డ్ డిస్ప్లే మరియు వాటర్ డ్రాప్ డిజైన్ మరియు ఇండిస్ప్లేయ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రానున్నది. ఇంకా బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ వాటర్ డ్రాప్ డిజైన్ తో కూడిన కెమెరా తో రానున్నది.సాధారణంగా F సిరీస్ మొబైల్ కాబట్టి ఈ మొబైల్ ధర 18000/-పైన ఉండవచ్చు. అంతే కాకుండా టీజర్స్ ప్రకారం రెనో సిరీస్ డిజైన్ తో ఒప్పో F15ప్రో ను కూడా తీసుకురానున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాలిసి ఉంది.

ఒప్పో F15 స్పెసిఫికేషన్స్:
1. మీడియా టెక్ హీలియో P70ప్రాసెసర్ మరియు మాలి G72 MP3 GPU
2.6.4ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే వాటర్ డ్రాప్ డిజైన్ తో మరియు కార్నింగ్ గొరిల్లా 5ప్రొటెక్షన్ తో
3.8జీబీ రామ్ మరియు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 256జీబీ వరకు ఎక్సపండబుల్
4.48ఎంపీ మెయిన్ కెమెరా +8ఎంపీ 119డిగ్రీ వైడ్ అంగెల్ కెమెరా +2ఎంపీ డెప్త్ సెన్సార్ +2ఎంపీ మాక్రో కెమెరా
5.ఫ్రంట్ 16ఎంపీ కెమెరా
6.ఆండ్రాయిడ్ 9.0 కలర్ ఓస్ 6.1 తో
7.బ్లూ టూత్ వెర్షన్ 5 మరియు ఇండిస్ప్లేయ్ ఫింగర్ ప్రింట్ సెన్సె
8. 4025mAh బాటరీ 30W వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో

ఈ ఫోన్ ధర మరియు విడుదల తేదీ కి సంబంధించిన ఖచ్చితమైన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Comments