మనలో చాలా మందికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అటువంటి వారికి పిక్సెల్ సిరీస్ మొబైల్స్ అంటే చాలా ఇష్టం. అయితే దురదృష్టవశాతూ పిక్సెల్ 4 సిరీస్ మొబైల్ సోలి రాడార్ చిప్ వల్ల ఇండియా లో విడుదల కాలేదు.అలాగే ఇండియా లో పిక్సెల్ 3A మరియు 3A XL మొబైల్స్ చాలా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వీటి సక్సెర్ పిక్సెల్ 4A రెండర్ ఇమేజెస్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటిలో కూడా సోలి రాడార్ చిప్ వుందా లేదా అన్న విషయం గురుంచి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం తెలియదు.
ఇప్పటివరకు లీక్స్ మరియు రెండర్ ఇమెజ్స్ ప్రకారం పిక్సెల్ 4A మొబైల్ 5.7 ఇంచ్ లేదా 5.8 ఇంచ్ డిస్ప్లే రానున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ మొబైల్ 700సిరీస్ ప్రాసెసర్స్ అయినా స్నాప్ డ్రాగన్ 730 లేదా 765 రావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా బ్యాక్ స్క్వేర్ షేప్ తోకూడిన సింగల్ కెమెరా తో రానున్నట్లు తెలుస్తుంది. ఈ కెమెరా పిక్సెల్ 4 సిరీస్ లో వాడిన 12.2ఎంపీ కెమెరానే వాడినట్లు సమాచారం. మొదటి సారి గూగుల్ పంచ్ హోల్ కెమెరా ను పిక్సెల్ 4A సిరీస్ మొబైల్స్ లో తీసుకురానున్నది. మిగతా పిక్సెల్ సిరీస్ మొబైల్స్ లానే ఈ మొబైల్ లో కూడా టైపు సి పోర్ట్,3.5 హెడ్ ఫోన్ జాక్ మంచి బిల్డ్ క్వాలిటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. వస్తున్నా లీక్స్ ప్రకారం ఈ మొబైల్స్ ను గూగుల్ I/O 2020 లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
Comments
Post a Comment