ఫింగర్ ప్రింట్ లాక్ తో ఆండ్రాయిడ్ యూజర్స్ కు వాట్సాప్ …..

ఇప్పుడు వాట్సాప్ సెక్యూరిటీ పరంగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది అదే ఫింగర్ ప్రింట్ లాక్ ద్వారా వాట్సాప్ ను ఉపయోగించడం. ఇప్పటికే ఈ ఫీచర్ ను ఐ ఫోన్ యూజర్స్ కు టచ్ ఐడి మరియు ఫేస్ ఐడి ద్వారా అందిస్తుంది. అదే ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్స్ కు కుడా రాన్నున్నట్లు వాట్సాప్ అధికారకంగా ప్రకటించింది అలాగే ఈ ఫీచర్ అప్డేట్ ద్వారా త్వరలోనే గ్లోబల్ గా అందరికి రానున్నది.

ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ ను క్రింది విధంగా చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు.

1. మొదటగా వాట్సాప్ లో అకౌంట్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుని దానిలో ప్రైవసీ ను సెలెక్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ప్రైవసీ లో ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
3.ఆన్ లాక్ విత్ ఫింగర్ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి.
4.ఇప్పటికే మొబైల్ లో రిజిస్టర్ చేయబడిన ఫింగర్ ప్రింట్ ను ఒక సారి ఉపయోగించడం ద్వారా ఈ ఫీచర్ ను సెట్ చేయడం జరుగుతుంది.

ఈ ఫీచర్ లో ఆటోమేటిక్ లాక్ ,వెంటనే(ఇమ్మీడియేటలీ),ఆఫ్టర్ 1 మినిట్ ( after 1 min ) , ఆఫ్టర్ 30మినిట్స్ ( after 30 min) అనే ఆప్షన్స్ కూడా వున్నాయి.

అయితే ఈ ఫీచర్ ద్వారా కేవలం మనము వాట్సాప్ ఓపెన్ చేయడానికి మరియు వాడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

నోటిఫికెషన్స్ ద్వారా వచ్చే మెస్సేజెస్ మరియు కాల్స్ ను ఈ ఫీచర్ లేకుండానే వాటికీ రెప్లైస్ ఇవ్వచ్చు.

Comments