నవంబర్ 5 న షియోమీ కంపెనీ 5 సిరీస్ టీవీ మరియు వాచ్ అలాగే మీ సీసీ9 మరియు సీసీ9ప్రో మొబైల్స్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మీ సీసీ9ప్రో మొబైల్ గీక్ బెంచ్ లో మెరిసింది. గీక్ బెంచ్ ప్రకారం మీ సీసీ9 ప్రో మొబైల్ ను గ్లోబల్ గా మీ నోట్ 10గా విడుదల కానున్నది.
మీ సీసీ9ప్రో గీక్ బెంచ్ లో సింగల్ కోర్ లో 545 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 1640 స్కోర్ చేసింది. ఇంకా నోట్ 10 విషయానికొస్తే సింగల్ కోర్ లో 544 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 1713 స్కోర్ చేసింది. నోట్ 10 మొబైల్ ప్రత్యేకత ఏంటంటే 108ఎంపీ తో కూడిన 5 కెమెరా లతో రానున్నది. ఈ మొబైల్ గ్లోబల్ గా నవంబర్ 14న పోలాండ్ లో విడుదల చేయనున్నారు. షియోమీ ఇప్పటికే పోలాండ్ వెబ్ సైట్ లో పోస్టర్స్ ను ప్రదర్శిస్తుంది.
ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే రెండు మొబైల్స్ ఇంచు మించు ఒకేరకమైన స్పెసిఫికేషన్స్ తో రానున్నాయి.
మీ సీసీ9ప్రో(మీ నోట్ 10) ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్:
1.6.47ఇంచ్ ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే
2. స్నాప్ డ్రాగన్ 730జి ప్రాసెసర్ అడ్రెనో 618GPU తో
3.బ్యాక్ 108ఎంపీ కూడిన పెంటా కెమెరా సెటప్
4.ఫ్రంట్ 32ఎంపీ కెమెరా
5.6/8/12జీబీ రామ్ మరియు 64/128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లో
6.5260mAh కెపాసిటీ బ్యాటరీ,30W ఫాస్ట్ ఛార్జింగ్ తో
ఈ మొబైల్ ఇండియా లో విడుదలకి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు …
Comments
Post a Comment