మీడియా టెక్ P65 ప్రాసెసర్ విడుదల : మీడియా టెక్ కంపెనీ P65 అనే కొత్త ప్రాసెసర్ ను విడుదల చేసింది. ఈ ప్రాసెసర్ P60 మరియు P70ల కంటే కొంచెం భిన్నంగా పనిచేస్తుంది.
దీనిలో రెండు ARM కార్టెక్స్ A75 మరియు ఆరు ARM కార్టెక్స్ A55 కొర్స్ ను ఈ ప్రాసెసర్ లో ఉపయోగించారు. A75 కొర్స్ A73 కన్నా 23% అలాగే A55కొర్స్ A53 కన్నా 18% ఎక్కువ పనితీరును కలిగి ఉంటాయి. ఇంకా GPU విషయానికొస్తే దీనిలో Arm Mali-G52 2EEMC2 అనే GPU ను వాడారు. ఇది P60మరియుP70 ప్రాసెసర్ లో వాడిన GPU అంత శక్తివంతమైనది కాదు. అలాగే దీనిలో సెపరేట్ NPU ను వాడడం వల్ల P60మరియుP70 కన్నా రెండు రెట్లు AI పనితీరు ఉంటుంది. ఈ ప్రాసెసర్ గరిష్టంగా 2కే డిస్ప్లే ను సపోర్ట్ చేస్తుంది.
ఇంకా కెమెరా విషయం లో 48ఎంపీ 4సెల్ కెమెరా అలాగే డ్యూయల్ కెమెరా లో 16+16ఎంపీ , సింగల్ 25ఎంపీ కెమెరా సెటప్ ను ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వీడియో డిపార్ట్మెంట్ లో గరిష్టంగా 2కే మరియు 1080@60FPS వరకు రికార్డు చేయగలదు. అలాగే 8జీబీ రామ్ వరకు మరియు LPDDR3, LPDDR4x లను సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ విషయం లో P60మరియుP70 లాగా ఈ ప్రాసెసర్ UFS స్టోరేజ్ సపోర్ట్ లేదు. ఈ ప్రాసెసర్ eMMC 5.1స్టోరేజ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ ను మనం మిడ్ రేంజ్ మరియు బడ్జెట్ మొబైల్స్ లో చూడవచ్చు.
Comments
Post a Comment