ఇండియా లో 5సంవత్సరాల సందర్భంగా కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేయనున్న షియోమీ మీ

షియోమీ మీ కంపెనీ ఇండియా కి వచ్చి 5సంవత్సరాలైనా సందర్భంగా మీ కంపెనీ సంబరాల్లో భాగంగా జులై నెలలో కొత్త ప్రొడక్ట్స్ ను విడుదలచేయనున్నది. వాటి లో రెండు బ్లూ టూత్ హెడ్ సెట్స్ , రిఛార్జబుల్ led లాంప్ , బిలిడింగ్ సెట్ , ఫాస్ట్ చార్జర్ అని 5కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేయనున్నది.

రెండు బ్లూ టూత్ హెడ్ సెట్స్ లో ఒకటి నెక్ బ్యాండ్ కాగా మరొకటి ఫోల్డబుల్ బ్లూ టూత్ హెడ్ సెట్. నెక్ బ్యాండ్ బ్లూ టూత్ హెడ్ సెట్ 35గ్రాముల బరువుతో , 1గంట పాటు ఛార్జ్ చేస్తే 7గంటలపాటు పనిచేస్తుంది. ఇంకా రెండోవది AptX , 40MM డ్రైవర్స్ , టచ్ కంట్రోల్స్ ,400mAh బాటరీ తో వస్తుంది.

రీఛార్జబుల్ LED లాంప్ 2000mAh బ్యాటరీ తో మరియు 4500k, 3200k and 2600k మూడు కలర్ టెంపరచర్స్ లో వస్తుంది. ఈ లాంప్ పూర్తి వెలుతురు తో 4గంటలు , మధ్యస్థ వెలుతురు తో 7గంటలు , తక్కువ వెలుతురు తో 40గంటల పాటు పనిచేస్తుంది. అలాగే చిన్న పిల్లల కోసం ట్రక్ బిలిడింగ్ సెట్ ను కూడా తీసుకురానున్నది.

ఇంకా చివరిది ఫాస్ట్ చార్జర్ , ఇప్పటికే ఇండియా లో 15W ఫాస్ట్ చార్జర్ అందుబాటులో వుంది. ఇప్పుడు మీ కంపెనీ కొత్త కొత్త చార్జర్ 27W ను కూడా ఇండియా లో రెడీమి కే సిరీస్ ఫోన్స్ తో పాటు విడుదల చేయవచ్చు

Comments