రీసెంట్ గా ఇండియా లో నోకియా కంపెనీ నోకియా 4.2 మరియు నోకియా 3.2 మొబైల్స్ ను విడుదల చేసింది. ఇప్పుడ జూన్ 6న మరి కొన్ని మొబైల్స్ విడుదల చేయనున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఇన్విటేషన్ మీడియా కి నోకియా పంపించింది. ఈ ఈవెంట్ లో మనం నోకియా 9 మరియు నోకియా 1ప్లస్ మొబైల్స్ ను ఆశించవచ్చు.
నోకియా 1 ప్లస్ మొబైల్స్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మొబైల్. ఈ మొబైల్ 5.45 ఇంచ్ IPS FWVGA+ డిస్ప్లే మరియు 18:9 డిజైన్, అలాగే మీడియా టెక్ ప్రాసెసర్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ గో మొబైల్ కాబట్టి 1జీబీ రామ్ మరియు 8జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇంకా బ్యాక్ 8ఎంపీ కెమెరా LED ఫ్లాష్ మరియు ఫ్రంట్ 5ఎంపీ కెమెరా వున్నాయి. ఈ మొబైల్ 2500mAh బ్యాటరీ కెపాసిటీ తో వస్తుంది. ఈ మొబైల్ రెడీమి గో మొబైల్ కి పోటీగా రావచ్చు.
నోకియా 9 మొబైల్ MWC 2019 లో విడుదల చేసారు. ఇప్పటికే నోకియా కంపెనీ సోషల్ మీడియా లో నోకియా 9కి సంబంధించిన టీజర్స్ విడుదలచేసింది. నోకియా స్నాప్ డ్రాగన్ 845 మరియు 5.99ఇంచ్ క్వాడ్ HD+ అమోల్డ్ స్క్రీన్ మరియు 18:9 డిజైన్ తో వస్తుంది. ఈ మొబైల్ స్పెషల్ ఏంటంటే ప్రపంచం లో మొట్టమొదటి 5కెమెరా(5*12ఎంపీ ) ఫోన్ ఇదే. అలాగే ఫ్రంట్ 20ఎంపీ సింగల్ కెమెరా ,ఆండ్రాయిడ్ వన్ ఓస్ తో వస్తుంది. ఇంకా 3320mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. నోకియా 9 6జీబీ రామ్ మరియు 128జీబీ వేరియంట్ లో లభిస్తుంది. అయితే నోకియా ఇండియా లో పెట్టె ధరలను బట్టి ఈ మొబైల్స్ సేల్స్ మరియు సక్సెస్ ఆధారపడి ఉంటాయి. ఈ మొబైల్స్ ధర గురుంచి ఎటువంటి సమాచారం లేదు.
Comments
Post a Comment