వన్ ప్లస్ కంపెనీ వన్ ప్లస్ 7సిరీస్ మొబైల్స్ ను 14 మే 2019న గ్లోబల్ గా విడుదల చేసింది. అయితే మొదటగా వన్ ప్లస్ కంపెనీ వన్ ప్లస్ 7ప్రో మొబైల్ ను సేల్ కి తీసుకొచ్చింది. ఇప్పడు అందరు ఎదురుచూస్తున్నా వన్ ప్లస్ 7 మొబైల్ జూన్ 4 మధ్యాహ్నం 12గంటల నుండి అమెజాన్ లో సేల్ కి రానున్నది.
వన్ ప్లస్ మొబైల్స్ 30-40కే బడ్జెట్ లో తిరుగులేని ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్స్ ను అందిస్తున్న కంపెనీ వన్ ప్లస్. వన్ ప్లస్ 7 మొబైల్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 855(7nm) తో, అలాగే బ్యాక్ 48ఎంపీ?(f1.7)+5ఎంపీ(f/2.4) మరియు ఫ్రంట్ 16ఎంపీ కెమెరా తో వస్తుంది. అంతే కాకుండా 6/8జీబీ రామ్ మరియు 128/256జీబీ స్టోరేజ్ లో లభిస్తుంది. వన్ ప్లస్ 7 మొబైల్ 3700mAh బ్యాటరీ కెపాసిటీ మరియు 20W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇవే కాకుండా స్టీరియో స్పీకర్స్ , డాల్బీ ATMOS,USB టైపు -సి పోర్ట్, UFS 3.0,DCI-P3ప్రొటెక్షన్,నైట్ స్కేప్ 2.0,OIS వంటి ఫీచర్స్ తో వస్తుంది.
ఈ మొబైల్ 6/128జీబీ మోడల్ ధర 32999/- మరియు 8/256జీబీ మోడల్ ధర 37999/-గా వుంది. అంతే కాకుండా SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు మీద 2000డిస్కౌంట్ , జియో ,మొబైల్ ఎక్స్చేంజి మరియు బై బ్యాక్ వంటి లాంచింగ్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
Comments
Post a Comment