జూన్ 11న విడుదలకానున్న సామ్ సుంగ్ గాలక్సీ M40

ప్రపంచపు ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ దిగ్గజమైన సామ్ సుంగ్ M సిరీస్ లో భాగంగా 4వ మొబైల్ అంటే సామ్ సుంగ్ గాలక్సీ M40 ను జూన్ 11న విడుదల చేయనున్నది. ఇప్పటికే సామ్ సుంగ్ గాలక్సీ M40 మొబైల్ విడుదలకి సంబంధించిన పోస్టర్స్ అమెజాన్ లో దర్శనమిచ్చాయి. సామ్ సుంగ్ గాలక్సీ M సిరీస్ మొబైల్స్ ను అమెజాన్ ఎక్సక్లూసివ్ గా తీసుకొస్తారు. ఇప్పుడు కూడా సామ్ సుంగ్ గాలక్సీ M40 మొబైల్ అమెజాన్ ఎక్సక్లూసివ్ గా లభించనుంది.

ఇప్పటి వరకు లీకైన లీక్స్ మరియు అమెజాన్ లో పోస్టర్స్ ప్రకారం ఈ మొబైల్ ఫ్రంట్ పంచ్ హోల్(ఇన్ఫినిటీ O ) కెమెరా తో రానున్నది.అలాగే బ్యాక్ M30మొబైల్ లానే ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది.ఇంకా సామ్ సుంగ్ గాలక్సీ M40 మొబైల్ స్నాప్ డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్ అంటే స్నాప్ డ్రాగన్ 675 తో రావచ్చు.

లీకెడ్ స్పెసిఫికేషన్స్:

1.స్నాప్ డ్రాగన్ 675(11nm)ప్రాసెసర్
2.6+ఇంచ్ ఫుల్ HD+ ఇన్ఫినిటీ O డిజైన్ తో
3.4/6జీబీ రామ్ మరియి 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
4.16ఎంపీ+8ఎంపీ+5ఎంపీ బ్యాక్ ట్రిపుల్ కెమెరా
5.ఆండ్రాయిడ్ 9.0 వన్ UI1.1 వెర్షన్ తో
6.5000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
7.బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

వస్తున్నా లీక్స్ ప్రకారం ఈ మొబైల్ ధర 20-25 వేల రూపాయలోపు ఉండవచ్చు.

Comments