4500 mAh బ్యాటరీ తో రానున్న Samsung Galaxy నోట్ 10 ప్రో

4500 mAh బ్యాటరీ తో రానున్న Samsung Galaxy నోట్ 10 ప్రో వివరాలు : Samsung ప్రతి సంవత్సరం 2 ఫ్లాగ్ షిప్ ఫోన్స్ ని లాంచ్ చేస్తుంది. ఒకటి S సిరీస్ , 2వది నోట్ సిరీస్ . ఈ సంవత్సరం S10 సిరీస్ ని ఇప్పటికే లాంచ్ చేసింది. ఇప్పుడు నోట్ సిరీస్ లాంచ్  చేయడానికి సిద్ధం గా ఉంది.

ఈ సంవత్సరం విడులయ్యే samsung నోట్ సిరీస్ 4 లేదా 3 మోడల్స్ లో విడులవుతాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. S10 ని కూడా samsung ఈ సంవత్సరం 3 మోడల్స్ లో తీసుకువచ్చారు.

రీసెంట్ గా samsung Galaxy Note 10 ప్రో బ్యాటరీ వివరాలు లీక్ అయ్యాయి. ఈ మొబైల్ 4500 mAh బ్యాటరీ తో రానుంది. అలాగే 6 కామెరాస్ ( ముందు 2, వెనుక 4 ) తో రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వెనుక ( 12MP + 12MP + 12MP + ToF ) కెమెరాలు ఉంటాయి అని ఇప్పటికే.  కొంతమంది  లీక్ స్టార్స్ ప్రకటించారు.

ఈ మొబైల్  ఆగస్టు లో కానీ,  సెప్టెంబర్ లో కానీ విడుదల కావచ్చు.

Comments