గీక్ బెంచ్ లో లీకైన నోకియా X71(నోకియా 6(2019))

HMD గ్లోబల్ నోకియా తమ కొత్త ఫోనైనా నోకియా X71 కి సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్ మరియు FIH OTA(చైనా) ట్రాకర్ స్క్రీన్ షాట్స్ నెట్ లో హలచల్ చేస్తున్నాయి. ఈ ఫోన్ గ్లోబల్ గా నోకియా 6(2019)గా అంటే నోకియా 6.2 గా విడుదల కావచ్చు.

గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో రానున్నది. గీక్ బెంచ్ ప్రకారం నోకియా X71 సింగల్ కోర్ లో 1455 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 5075 స్కోర్ చేసింది.నోకియా X71 డ్యూయల్ కెమెరా సెటప్ అప్ ను కలిగి వుంది. దీనిలో ప్రైమరీ కెమెరా 48ఎంపీ కాగా సెకండరీ కెమెరా 120డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా. ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా తో రానున్నది. నోకియా నుంచి వస్తున్నా మొదటి పంచ్ హోల్ కెమెరా ఫోన్ ఇదే.

లీకెడ్ నోకియా X71(నోకియా 6(2019)) స్పెసిఫికేషన్స్:

1. స్నాప్ డ్రాగన్ 660(14nm) ప్రాసెసర్
2.6.22 ఇంచ్ ఫుల్ HD+ మరియు 19:9 డిస్ప్లే
3.4/6జీబీ రామ్ మరియు 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
4.ఆండ్రాయిడ్ 9.0 మరియు ఆండ్రాయిడ్ వన్
5.డ్యూయల్ కెమెరా సెటప్ : ప్రైమరీ కెమెరా 48ఎంపీ
సెకండరీ కెమెరా 120డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా
6.ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా
7.3050mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో

Comments