Redmi మొదటి ఆండ్రాయిడ్ గో ఫోన్ ఇండియా లో లాంచ్ అయింది

ఇండియా లో రెడీమి ఫోన్స్ కి చాలా ఆదరణ ఉంది మనకి తెలుసు. ఇప్పుడు షియోమీ రెడీమి బ్రాండ్ పేరు మీద ఇండియా లో తన మొదటి ఆండ్రాయిడ్ గో ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఒరియా గో ఎడిషన్ మీద రన్ అవుతున్నది.

ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అనేది తేలికపాటి ఆండ్రాయిడ్(లైట్) ఓస్. ఈ గో ఓస్ లో అన్ని అప్స్ తేలికపాటి అప్స్ ను కలిగివుంటుంది. దీనివల్ల అప్స్ అన్నీకూడా త్వరగా లోడ్ అవుతాయి. అంతేకాక ఆండ్రాయిడ్ గో ఫోన్స్ ఫీచర్ ఫోన్స్ వాడేవాళ్లుకు ఫీచర్ ఫోన్ వాడే అనుభవాన్ని కలిగిస్తూ వాళ్ళకు స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ ను కూడా అందిస్తుంది.
ఇంకా రెడీమి ఆండ్రాయిడ్ గో ఫోన్ స్నాప్ డ్రాగన్ 425ప్రాసెసర్ మరియు 5ఇంచ్ HD డిస్ప్లే అలాగే 16:9 యాస్పెక్ట్ రేషియో తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ బ్యాక్ 8ఎంపీ కెమరా మరియు ఫ్రంట్ 5ఎంపీ కెమెరా ను కలిగి వుంది. ఈ ఫోన్ 1జీబీ రామ్ మరియు 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

 ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ ఎక్సక్లూసివ్ గా లభిస్తుంది. మిగతా కంపెనీస్ ఆండ్రాయిడ్ గో ఫోన్స్ ను మాములు స్మార్ట్ ఫోన్స్ ధరకి అందుబాటులోకి తెచ్చారు. ఇవి అంతగా ఆదరణ పొందలేదు. చూద్దాం రెడీమి ఐనా సక్సెస్ అవుతుందో లేదో  చూద్దాం.
ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ క్రింది విధంగా వున్నాయి.
1. ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 425
2. 1జీబీ రామ్ మరియు 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
3.5ఇంచ్ HD డిస్ప్లే , 16:9 యాస్పెక్ట్ రేషియో
4.బ్యాక్ 8ఎంపీ కెమరా మరియు ఫ్రంట్ 5ఎంపీ కెమెరా
5.3000Mah బ్యాటరీ
6. ఆండ్రాయిడ్ ఒరియా గో ఎడిషన్ ఓస్
ఈ ఫోన్ ఇండియాలో 20లోకల్ భాషలను సపోర్ట్ చేస్తుంది.
మొబైల్ ధర & ఎప్పుడు లభిస్తుంది : 
Rs. 4,499 
1st సేల్  March 22,2019 నుండి flipkart లో , మీ.com లో లభిస్తుంది.
Unboxing వీడియో తెలుగులో : 

Comments