వైడ్ వైన్ L అంటే ఏమిటి …..?

ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏ మొబైల్ కొన్న దానిలో వైడ్ వైన్ L సపోర్ట్ వుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఉంటే అది ఏ లెవెల్ లో వుందో చెక్చేసుకుంటాం. అసలు వైడ్ వైన్ L అంటే ఏమిటి ..? ముందుగా వైడ్ వైన్ L సపోర్ట్ గురుంచి తెలుసుకునేముందు DRM(డిజిటల్ రైట్ మానేజ్మెంట్) అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి.
Image result for widevine l
ఇంటర్నెట్ లో ప్రతిదానికి కాపీ రైట్ ఆక్ట్ ఉంటుందని మనందరికీ తెలుసు. DRM(డిజిటల్ రైట్ మానేజ్మెంట్) కూడా అట్లాంటిదే. నేటి ప్రపంచం లో డిజిటల్ కంటెంట్ హవా పెరిగిపోయింది.మనం నెట్ లో అందరం వీడియోస్ చూస్తూవుంటాం అయితే ఈ వీడియోస్ ను ఎవరు కాపీ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కంటెంట్ ప్రొవైడర్ కు వుంది. అట్లాంటివారికి DRM(డిజిటల్ రైట్ మానేజ్మెంట్) అనేది ఒక ఆయుధం.

వైడ్ వైన్ అనేది గూగుల్ క్రోమ్ మరియు ఆండ్రాయిడ్ మీడియా లో వాడే DRM(డిజిటల్ రైట్ మానేజ్మెంట్) యొక్క టూల్. దీని వైడ్ వైన్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీ ని గూగుల్ 2010లో కొన్నది. వైడ్ వైన్ టెక్నాలజీ ని గూగుల్ కంటెంట్ ప్రొవైడర్స్ కి ఫ్రీ గా అందింస్తుంది. దీని కోసం గూగుల్ కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి ఎటువంటి ఫీజు వసూల్ చేయదు.

వైడ్ వైన్ సెక్యూరిటీ మొత్తం 3రకాల లెవెల్స్ లో అందించబడుతుంది. అవి వైడ్ వైన్ L1,వైడ్ వైన్ L2,వైడ్ వైన్ L3.ఆండ్రాయిడ్ డివైసెస్ కేవలం వైడ్ వైన్ L1 మరియు వైడ్ వైన్ L3 లెవెల్స్ ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి.
CENC ఎన్క్రిప్షన్ , లైసెన్సింగ్ కీ ఎక్స్చేంజి మరియు అడాప్టివ్ స్ట్రీమింగ్ అనే వాటిని ఉపయోగించుకుని వీడియోస్ ను కాపీ చేయకుండా కంటెంట్ ప్రొవైడర్స్ జాగ్రత్తలు తీసుకుంటారు.
పైన చెప్పిన ప్రాసెస్ అంత కూడా ట్రస్టడ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ (Trusted Execution Environment (TEE)) అనే విభాగం లో జరిగినట్లైంతే ఆ మొబైల్ లేదా డివైస్ వైడ్ వైన్ L1 ను సపోర్ట్ చేస్తుంది. వైడ్ వైన్ L1 లో మనం వీడియోస్ ను 720P లేదా 1080P లో అంటే HD క్వాలిటీ లో చూడవచ్చు. అట్లాకాకుండా ఆ ప్రాసెస్ అంతా ట్రస్టడ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ (Trusted Execution Environment (TEE)) అనే విభాగం బయట జరిగినట్లైతే ఆ మొబైల్ లేదా డివైస్ వైడ్ వైన్ L3 ను సపోర్ట్ చేస్తుంది.వైడ్ వైన్ L3 లో మనం గరిష్టంగా 540P క్వాలిటీ లో మాత్రమే వీడియోస్ చూడగలము. ఏదిఏమైనా వీడియోస్ ను ప్రొటెక్ట్ చేయడానికి కంటెంట్ ప్రొవైడర్స్ కావలిసిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు.
ప్రస్తుతం NETFLIX, అమెజాన్ ప్రైమ్,బీబీసీ మొదలుగున్న ఆన్లైన్ కంటెంట్ ప్రొవైడర్స్ వైడ్ వైన్ L1 మరియు వైడ్ వైన్ L3 లలో తమ సర్వీసెస్ ను అందిస్తున్నాయి. మన ఆండ్రాయిడ్ డివైస్ ఏ లెవెల్ ను సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి DRM ఇన్ఫో అనే అప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.

Comments