జూన్ లో ఇండియా కి రానున్న వివో iQOO గేమింగ్ ఫోన్

ప్రస్తుతం ప్రపంచమంతా గేమింగ్ ఫోన్స్ హవా నడుస్తుంది. చాలా కంపెనీస్ సబ్ బ్రాండ్స్ ను ఏర్పాటుచేసుకుని గేమింగ్ ఫోన్స్ ను విడుదల చేస్తున్నాయి. తాజాగా వివో కూడా iQOO అనే సబ్ బ్రాండ్ ను చైనా లో లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ పేరు మీద వివో గేమింగ్ ఫోన్స్ ను తీసుకురానున్నది. చైనా లో ఇప్పటికే iQOO పేరు మీద ఒక గేమింగ్ ఫోన్ ను విడుదల చేసింది.
Image result for IQOO

లేటెస్ట్ గా వివో ఎక్సక్యూటివ్ చెప్తున్న సమాచారం ప్రకారం వివో iQOO బ్రాండ్ ను మే చివరి వారం లో లేదా జూన్ మొదటి వారం లో కానీ ఇండియా కి తీసురానున్నది అని తెలుస్తుంది. ఈ సమాచారం ప్రకారం iQOO పేరు మీద రెండు మొబైల్స్ ను 4వేరియంట్స్ లో తీసుకురానుంది. లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఒక మొబైల్ స్నాప్ డ్రాగన్ 710 మరియు మరొకటి స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ లతో రానున్నాయి.
ఈ మొబైల్ వివో 30000-60000 రూపాయల మధ్యలో తీసుకురానుంది. అంటే వివో వన్ ప్లస్ ఫోన్స్ కి పోటీగా ఈ మొబైల్స్ ను విడుదల చేయనున్నది. ఈ మొబైల్ మల్టీ టర్బో అనే ఫీచర్ క్రింద AI టర్బో,సెంటర్ టర్బో, నెట్ టర్బో, కూలింగ్ టర్బో, మరియు గేమ్ టర్బో అనే ఫీచర్స్ అందిస్తుంది.

చైనా విడుదలైన iQOO ఫోన్ స్పెసిఫికేషన్స్ క్రింది విధంగా వున్నాయి.
1.స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్
2.6.41 ఇంచ్ సూపర్ అమోల్డ్ స్క్రీన్ హలొ నాచ్ తో
3.6/8/8/12జీబీ రామ్ మరియు 128/128/256/256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో
4.బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ (12ఎంపీ +13ఎంపీ+2ఎంపీ)
ఫ్రంట్ 12ఎంపీ కెమెరా
5.4000mAh బ్యాటరీ , 44W ఫాస్ట్ ఛార్జింగ్ USB టైపు-సి పోర్ట్ తో

Comments