ఇండియా లో BIS సర్టిఫికేషన్ పొందిన రియల్ మీ 3 ప్రో

రియల్ మీ 3 విడుదల సమయంలో రియల్ మీ కంపెనీ ఏప్రిల్ 2019 లో రియల్ మీ 3ప్రో ను విడుదల చేయనున్నట్లు చెప్పింది. రిలీజ్ నెల దగ్గర కొచ్చేకొద్దీ రియల్ మీ 3ప్రో కి సంభందించిన సమాచారం అలాగే లీక్స్ బయటపడుతున్నాయి. తాజాగా రియల్ మీ 3ప్రో RMX1851అనే మోడల్ నెంబర్ తో థాయిలాండ్ కి సంభందించిన NBTC మరియు ఇండియాకి సంభందించిన BIS సర్టిఫికేషన్స్ ను పొందింది.
Image result for realme 3 pro RMX1851

ఈ ఫోన్ రియల్ మీ 2ప్రో కి కొనసాగింపుగా విడుదల కానున్నది. ఈ మొబైల్ BIS సర్టిఫికేషన్ లో మోడల్ నెంబర్ తో రిజిస్టర్ కాగా ,NBTC సర్టిఫికేషన్ లో మోడల్ నెంబర్ తో పాటు మొబైల్ పేరు కూడా రిజిస్టర్ యింది.
వస్తున్నా లీక్స్ ప్రకారం ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 675(11nm) ప్రాసెసర్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. మిగతా వాటికీ సంభందించిన సమాచారం తెలియలిసివుంది. ఇప్పటికే రియల్ మీ కంపెనీ స్పీడ్ అవకెన్స్ (SPEED AWAKENS) అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేస్తుంది. ఈ ఫోన్ ఒప్పో VOOC ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Comments