మార్చ్ 25న ఇండియా లో విడుదలకానున్న మోటో జి7

ప్రపంచవ్యాప్తంగా మోటోరోలా మోటో జి7 సిరీస్ మొబైల్స్ ను విడుదలచేసిన సంగతి అలాగే మోటో జి7 పవర్ ను కూడా ఫిబ్రవరి 15నుండి ఇండియా లో సేల్ కి తీసుకొచ్చిన విషయం కూడా మనం కి తెలుసు. ఇప్పుడు మోటో జి7 ఇండియా లో విడుదల చేయడనికి మోటోరోలా సిద్దమయ్యింది. మార్చ్ 25 న ఇండియా లో విడుదల చేయనున్నది.
ఇప్పటికే దీనికి సంభందించిన ప్రొమోషన్స్ ను స్టార్ట్ చేసింది. మోటోరోలా తమ ట్విట్టర్ పేజీ లో విడుదల తేదీ ని మరియు ప్రొమోషన్స్ ను ప్రకటించింది. “#matterstoyou” అనే పేరు తో ఫేసుబుక్ , ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ లలో ఒక కాంటెస్ట్ ను కూడా రన్ చేస్తుంది. ఈ కాంటెస్ట్ గెలిచిన 7గురు విన్నర్స్ కు మోటో జి7 విడుదల రోజున మోటో జి7 ఫోన్స్ ను వారికీ అందించనున్నది.
Image result for moto g7 power

ఇంకా మోటో జి7 స్నాప్ డ్రాగన్ 632ప్రాసెసర్ తో , 4జీబీ రామ్ మరియు 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ,డ్యూయల్ కెమెరా సెట్ అప్, USB టైపు -సి పోర్ట్ ,ఆండ్రాయిడ్ ఫై తో వస్తుంది.
ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ క్రింది విధంగా ఉన్నాయి. 1. స్నాప్ డ్రాగన్ 632(14nm) ప్రాసెసర్ మరియు అడ్రెనో 506 gpu తో
2. 4జీబీ రామ్ మరియు 64జీబీ స్టోరేజ్ తో
3. డ్యూయల్ కెమెరా : మెయిన్ కెమెరా 12ఎంపీ , f/1.8,1.25um
సెకండరీ కెమెరా 5ఎంపీ,f /2.2 డెప్త్ సెన్సార్
4. ఫ్రంట్ కెమెరా 8ఎంపీ కెమెరా
5.డ్యూయల్ సిమ్ మరియు డెడికేటెడ్ మైక్రో sd కార్డు స్లాట్
6.usb టైపు సి పోర్ట్ మరియు 3000mAh బ్యాటరీ
7.15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో , ఫింగర్ ప్రింట్ సెన్సార్
8.వాటర్ డ్రాప్ నాచ్ 19:9 డిస్ప్లే మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో
అయితే ఈ ఫోన్ ధర ను బట్టి ఈ ఫోన్ సక్సెస్ మరియు సేల్స్ ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తో వేరే కంపెనీ ఫోన్స్ చాలా తక్కువ ధరకే మార్కెట్ లో లభిస్తున్నాయి. మోటో జి7 తో పాటు మోటో జి7 ప్లస్ మరియు మోటో జి7 ప్లే లను కూడా లాంచ్ చేస్తారో లేదో ఎటువంటి సమాచారం లేదు ….చూద్దాం ఏఏ ఫోన్స్ ను మోటోరోలా విడుదల చేస్తుందో. ఈ ఫోన్ సిరామిక్ బ్లాక్ మరియు క్లియర్ వైట్ కలర్స్ లో లభించనుంది.

Comments