ప్రంపంచపు నెంబర్ 1 ఎలక్ట్రానిక్ కంపనియినా సాంసుంగ్ రీసెంట్ మొబైల్ రంగం లో కొత్త M సిరీస్ మొబైల్స్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా M10 మరియు M20 అనే రెండు కొత్త మొబైల్స్ మొదటగా ఇండియా లో విడుదల చేసిన సంగతి అందరికి తెలిసందే . ఇప్పుడు M సిరీస్ లో మూడోవ మొబైల్ M30 ను ఫిబ్రవరి 27న విడుదల చేసింది.

డిస్ప్లే :
సాంసుంగ్ M30 6.4 ఇంచ్ ఫుల్ HD+సూపర్ అమోల్డ్ స్క్రీన్ మరియు ఇన్ఫినిటీ U నాచ్ అలాగే 19.5:9 తో వస్తుంది. సూపర్ అమోల్డ్ స్క్రీన్స్ పని తీరు LCD స్క్రీన్స్ కన్నా మెరుగుగా పనిచేస్తాయి అలాగే బ్యాటరీ ని తక్కువగా వాడుకుంటాయి. బడ్జెట్ ధర లో సూపర్ అమోల్డ్ స్క్రీన్ తో ఈ మొబైల్ రావడం ఎంతో మెచ్చుకోదగిన విషయం. ఈ మొబైల్ వైడ్ వైన్ L1 మరియు డాల్బీ ATMOS ను సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్ :
ఈ మొబైల్ సాంసుంగ్ ఎక్సీనోస్ 7904 (14nm) తో వస్తుంది. దీని పనితీరు స్నాప్ డ్రాగన్ 636 కి సరిసమానంగా పనిచేస్తుంది. అయితే సాంసుంగ్ ఎక్సీనోస్ 7904 లో పొందిపరిచిన GPU పనితీరు ఆశించనంతగా లేదు.
కెమెరా :
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీని లో ప్రైమరీ కెమెరా 13MP (f /1.9),సెకండరీ కెమెరా 5MP ( f /2.2),మూడోవ కెమెరా 5MP ( f /2.2) 123డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా తో వస్తుంది. ఇంకా సెల్ఫీ(ఫ్రంట్ కెమెరా)16MP( f /2.0) తో వస్తుంది.
రామ్ మరియు స్టోరేజ్ :
ఈ మొబైల్ రెండు వేరియంట్ లో లభిస్తుంది. మొదటిది 4జీబీ LPDDR4x రామ్ 64జీబీ వేరియంట్ కాగా రెండోవది 6జీబీ LPDDR4x రామ్ 128జీబీ వేరియంట్. మైక్రోsd కార్డు ను వుపయోగించి 512జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ క్రింది విధంగా వున్నాయి.
1 .6.4ఇంచ్″ 2340×1080 (సూపర్ అమోల్డ్ ఫుల్HD +డిస్ప్లే ) ఇన్ఫినిటీ -U నాచ్ మరియు 19.5:9 తో
2. సాంసుంగ్ ఎక్సీనోస్ 7904 (14nm) తో
3. 4జీబీ LPDDR4రామ్ మరియు 64జీబీ స్టోరేజ్ మరియు 6జీబీ LPDDR4x రామ్ 128జీబీ తో
4.కెమెరా : వెనుక ప్రైమరీ కెమెరా 13MP (f /1.9)
సెకండరీ కెమెరా 5MP ( f /2.2)
మూడోవ కెమెరా 5MP ( f /2.2) 123డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా 16MP( f /2.0)
5.డ్యూయల్ VoLTE మరియు 5000mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
6 ఆండ్రాయిడ్ ఒరియా 8.1 మరియు సాంసుంగ్ ఎక్సపీరియెన్స్ 9.5 తో
7 టైపు C పోర్ట్ తో మరియు ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ ఆన్ లాక్ తో
ఈ మొబైల్ గ్రేడియంట్ డిజైన్ మరియు గ్రేడియెంట్ బ్లూ , బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.
ధర :
ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర 15వేల రూపాయలోపు అంటే 4జీబీ రామ్ 64జీబీ స్టోరేజ్ ధర 14990/-రూపాయలు అలాగే 6జీబీ రామ్ 128జీబీ స్టోరేజ్ ధర 17990/-రూపాయలకు లభిస్తుంది.
ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర 15వేల రూపాయలోపు అంటే 4జీబీ రామ్ 64జీబీ స్టోరేజ్ ధర 14990/-రూపాయలు అలాగే 6జీబీ రామ్ 128జీబీ స్టోరేజ్ ధర 17990/-రూపాయలకు లభిస్తుంది.
ఈ ఫోన్ కేవలం అమెజాన్ మరియు సాంసుంగ్ ఆన్ లైన్ స్టోర్స్ లో మాత్రమే మార్చ్ 7వతేదీ నుండి లభిస్తుంది.
Comments
Post a Comment