షావోమి న్యూ ఎంట్రీ.. Mi Men's Sports Shoes 2





చైనా  కంపెనీ షావోమి మరో ఎత్తుగడతో భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైపోయింది. స్మార్ట్‌ఫోన్లతో ఇండియాలో అడుగుపెట్టి స్మార్ట్‌ఫోన్‌ రంగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న షావోమి తాజాగా  పాదరక్షల మార్కెట్‌పై కన్నేసింది.  గత రెండు రోజులుగా  ట్విటర్‌ ద్వారా ఊరిస్తూ వస్తున్న షావోమి అంచనాలకనుగుణంగానే ఎంఐ బ్రాండ్‌ ద్వారా 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2' పేరుతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  వీటి ప్రారంభ ధర  రూ.2,499గా నిర్ణయించింది.  ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా  ప్రీ ఆర్డర్‌ చేసినవారికి మార్చి 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. బ్లాక్‌, గ్రే, బ్లు రంగుల్లో లభ్యమవుతున్నాయి.  
ఎం షూస్‌  5ఇన్‌ 1 మౌల్డింగ్‌ టెక్నాలజీ,  5 రకాల  మెటీరియల్స్‌తో మేళవించిన ఇంజనీరింగ్‌ టెక్నాలజీతో  (షాక్‌ అబ్సార్బెంట్) , జారకుండా, దీర్ఘకాలం మన్నేలా వీటిని రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. పలు  ఉత్పత్తులతో  భారతీయ మార్కెట్‌లో విస్తరిస్తున్న షావోమి  ఎంఐటీవీలు, ఎయిర్‌ ప్యూరిఫైర్లు, మాస్కులు, సన్‌ గ్లాసెస్,  సూట్‌కేస్‌లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక  యువజనమే టార్గెట్‌గా  'ఎంఐ మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2'  లను రిలీజ్ చేసింది. 

   

    







Comments