“జియో గ్రూప్ టాక్”అనే కొత్త అప్ ను విడుదల చేసిన JIO


జియో తన యూజర్స్ కోసం కొత్తకొత్త అప్స్ అలాగే రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తూవుంటుంది దాని లో భాగంగానే ఇప్పుడు “జియో గ్రూప్ టాక్:వన్ టచ్ మల్టీ కాలింగ్ అప్లికేషన్ “అనే కొత్త ఆప్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి ఈ ఆప్ టెస్టింగ్ స్టేజి లో వుంది. మనం ఈ ఆప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని కేవలం జియో నెంబర్ తో రిజిస్టర్ చేసుకుని వాడుకోవచ్చు.

ఈ ఆప్ ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఒకేసారి 10మంది కాలెర్స్ తో మనం మాట్లాడవచు అంటే కాన్ఫరెన్స్ కాల్ లాగా అన్నమాట. అంతే కాకుండా మనం కాలర్ ను మ్యూట్ చేయడం, అలాగే న్యూ కాలర్ ను కాల్ మధ్యలో ఆడ్ చేయడం, కాల్ మద్యలోవున్న కాలర్ ను రిమూవ్ చేయడం వంటి ఎన్నో ఫీచర్స్ వున్నాయి. ఈ ఆప్ లో లెక్చర్ మోడ్ అనే ఒక ఫీచర్ ద్వారా మిగతా 9మంది కాలెర్స్ మ్యూట్ లో ఉండి ఒక కాలర్ చెపింది మాత్రమే మిగతావాళ్ళు వినగల్గుతారు. అంతే కాకుండా మనకి కావలిసిన గ్రూప్స్ ను ఏర్పపర్చుకుని వాటిని మేనేజ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ ఆప్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో వుంది. అంతే ఈ ఆప్ లో గ్రూప్ కాల్ లో నాన్ జియో కాలెర్స్ ను కూడా ఆడ్ చేసుకోవచ్చ. అలాగే ఈ ఆప్ ప్రస్తుతానికి మొబైల్ డేటా మీద పని చేస్తుంది. ఈ ఆప్ ద్వారా జియో 28కోట్ల యూజర్స్ కి మరింత దగ్గరవుతుంది.

Download : Click Here
Screenshot ImageScreenshot ImageScreenshot ImageScreenshot ImageScreenshot Image

Comments