ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ఫోన్స్ కి ఎంత డిమాండ్ ఉందొ మనందరికీ తెలుసు. చాలా కంపెనీలు రకరకాల గేమింగ్ ఫోన్స్ ను విడుదల చేస్తున్నాయి. ఇండియా లో కూడా గేమింగ్ ఫోన్స్ కి డిమాండ్ వుంది. ఇప్పటికే ఇండియా లో అసూస్ ROG గేమింగ్ ఫోన్ అలాగే న్యూబియా రెడ్ మేజిక్ గేమింగ్ ఫోన్లను విడుదల చేసాయి. 91మొబైల్స్ నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం ఇపుడు న్యూబియా తన రెండొవ గేమింగ్ ఫోన్ ను మార్చ్ లో ఇండియా లో విడుదల చేయనున్నది. న్యూబియా రెడ్ మేజిక్ మార్స్ గేమింగ్ ఫోన్ నవంబర్ 2018 లో చైనా లో విడుదలచేసింది. అలాగే న్యూబియా రెడ్ మేజిక్ మార్స్ గేమింగ్ ఫోన్ తో పాటు న్యూబియా X డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ను కూడా ఇండియా లో విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఎపుడు విడుదల చేస్తారనేది తెలియాలిసి వుంది.
న్యూబియా రెడ్ మేజిక్ మార్స్ గేమింగ్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో అలాగే 6ఇంచ్ ఫుల్ HDప్లస్ స్క్రీన్ తో వస్తుంది. ఈ గేమింగ్ ఫోన్ డ్యూయల్ పైప్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తో వస్తుంది,దీని వాళ్ళ గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ ఎక్కువగా వేడి అవ్వదు. ఈ ఫోన్ మెటల్ బ్లాక్ హనీ కొమ్బ్ స్ట్రక్చర్ తో వస్తుంది.ఈ మొబైల్ సింగల్ కెమెరా సెటప్ అలాగే నియో ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.అంతే కాకుండా 10జీబీ రామ్ మరియు 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగివుంటుంది.
ఈ మొబైల్ వెనుకవైపు RGB ప్యానెల్ ను కలిగి ఉంటుంది. దీని వాళ్ళ గేమ్స్ ఆడినప్పుడు కలర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి అలాగే ఈ RGB ప్యానెల్ 6రకాల కలర్ ఎఫెక్ట్స్ ను సపోర్ట్ చేస్తుంది.వీటిని మనకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఈ గేమ్స్ కోసం ప్రత్యేకంగా e-స్పోర్ట్ ట్రిగ్గర్ టచ్ బటన్స్ ను కలిగి వుంది. ఈ బటన్స్ PUBG లాంటి గేమ్స్ ఆడేటప్పుడు చాల ఉపయోగపడతాయి.అంతే కాకుండా ఈ ఫోన్ 4-డి షాక్ ఫీడ్ బ్యాక్ మరియు 7.1డి సౌండ్ ఎక్స్పీరియన్స్ ను గేమర్స్ కి అందిస్తుంది. ఈ మొబైల్ లో స్టీరియో స్పీకర్స్ ను కలిగి ఉంటుంది.
ఈ న్యూబియా రెడ్ మేజిక్ మార్స్ గేమింగ్ ఫోన్ స్పెసిఫికేషన్స్ క్రింది విధంగ వున్నాయి.
1 . 6-inch Full HD+ (2340 ×1080 pixels ) డిస్ప్లే 18:9 డిజైన్ తో మరియు డైనోరెక్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో
2 . స్నాప్ డ్రాగన్ 845(10nm) ప్రాసెసర్ తో
3 .8/10 జీబీ రామ్ మరియు 128/256జీబీ మెమరీ తో
4.బ్యాక్ కెమెరా : ప్రైమరీ కెమెరా 16 MPకెమెరా (f/1.8)
5.ఫ్రంట్ కెమెరా : 8MP
6. 3800 mAh బ్యాటరీ మరియు USB టైపు సి పోర్ట్ మరియు 18W ఫాస్ట్ చార్జర్ మరియు నియో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
7. ఆండ్రాయిడ్ 9.0 రెడ్ మేజిక్ 1.6 ఓస్ తో
8. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక
9. స్టీరియో స్పీకర్స్ , 7.1డి సౌండ్స్ ,4-డి షాక్ ఫీడ్ బ్యాక్
10. డ్యూయల్ పైప్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ
2 . స్నాప్ డ్రాగన్ 845(10nm) ప్రాసెసర్ తో
3 .8/10 జీబీ రామ్ మరియు 128/256జీబీ మెమరీ తో
4.బ్యాక్ కెమెరా : ప్రైమరీ కెమెరా 16 MPకెమెరా (f/1.8)
5.ఫ్రంట్ కెమెరా : 8MP
6. 3800 mAh బ్యాటరీ మరియు USB టైపు సి పోర్ట్ మరియు 18W ఫాస్ట్ చార్జర్ మరియు నియో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
7. ఆండ్రాయిడ్ 9.0 రెడ్ మేజిక్ 1.6 ఓస్ తో
8. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక
9. స్టీరియో స్పీకర్స్ , 7.1డి సౌండ్స్ ,4-డి షాక్ ఫీడ్ బ్యాక్
10. డ్యూయల్ పైప్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ
రుమోర్స్ ప్రకారం ఈ ఫోన్ ధర 35000/-లోపు ఉండవచ్చు.
Comments
Post a Comment