కేవలం మీ యొక్క వాయిస్ కమాండ్స్ ద్వారా క్షణాల్లో తెలుగు టైపు చేయండి

తెలుగులో టైపు చేయడానికి ఇబ్బంది పడుతున్నారా…? టైపు చేయడానికి సమయం సరిపోవట్లేదా…అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే… కేవలం మీ యొక్క వాయిస్ కమాండ్స్ ద్వారా క్షణాల్లో టైపు చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి Speechnotes అనే యాప్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది.



Step 1 :  ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా speechnotes యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఓపెన్ అవుతుంది. install ని క్లిక్ చేసి install చేసుకోవాలి.

Step 2 : ఇప్పుడు మీకు యాప్ ఓపెన్ అయ్యి అందులో notes రాయడానికి నోట్ పాడ్ window ఓపెన్ అవుతుంది.    window పై భాగాన మనకు భాష (లాంగ్వేజ్)ని మార్చుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. Default గా  En(ఇంగ్లీష్) ఉంటుంది. En ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క లాంగ్వేజ్ ని చేసుకోవచ్చు, తెలుగు, హిందీ,  కన్నడ, తమిళ్ ఉర్దూ. అరబిక్ వంటి అనేక  భాషలు ఇందులో చేంజ్ చేసుకోవడానికి వీలుంది. 
Step 3 : తరువాత windowకి క్రింద కుడిపక్కగా మైక్ సింబల్ ఉంటుంది. దానిని క్లిక్ చేసి మీ యొక్క వాయిస్ ద్వారా   మీరు మాట్లాడిన పదాలు అక్కడ టైప్ అవుతూ ఉంటాయి. కేవలం చక్కని ఉచ్చారణ ఉంటే సరిపోతుంది. మీరు  మాట్లాడడం పూర్తయిన తరువాత అదే మైక్ సింబల్ వద్ద pause చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు మీ టైపింగ్ పూర్తయినట్లే. ఇప్పడు ఆ text ని window పైభాగాన ఉన్న send బటన్ ద్వారా మీరు మీ సోషల్ మీడియాలో అంటే facebook, ట్విట్టర్, telegram, hike, వంటి మిగతా వాటికీ లేదా మెయిల్ గా సెండ్ చేసుకోవచ్చు. లేదా గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవచ్చు. మెనూ ద్వారా అదే ఫైల్ ని PDF గా convert చేసుకోవచ్చు.

Comments