వాట్సాప్‌ చిట్కాలు

Image result for whatsapp chitkalu


విషయం ఏదైనా.. ఒక్కటే మాట ‘వాట్సాప్‌ చెయ్‌!!’ మరి, దాంట్లో దాగున్న ముఖ్యమైన చిట్కాలేంటి? ఓ కన్నేద్దాం పదండి!

ఒక్కరితోనే గ్రూపు
మీతో మీరు మాత్రమే ఏదైనా షేర్‌ చేసుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? ఉదాహరణకు వాట్సాప్‌లో రోజూ ఏవేవో మెసేజ్‌లు చూస్తుంటాం. వాటిల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నవిగానీ.. ముఖ్యమైనవిగానీ.. పదే పదే వెతుక్కోకుండా ఒకచోట పెట్టుకుంటే! ఏదైనా అవసరమైనప్పుడు క్షణాల్లో యాక్సెస్‌ చేయొచ్చు. అందుకు సులువైన విధానం ఏంటంటే.. మీతో మీరే అలాంటి డేటాని పంచుకోవడం. అందుకు ఏదైనా పేరుతో గ్రూపుని క్రియేట్‌ చేయండి. అందుకు ఎవరో ఒకరిని గ్రూపులో సభ్యునిగా యాడ్‌ చేయాలి. తర్వాత వారిని గ్రూపు నుండి తొలగించండి. అప్పుడు మీరొక్కరే గ్రూపులో ఉంటారు. అప్పుడు గ్రూపులో షేర్‌ చేసింది మీరు మాత్రమే చూడగలరన్నమాట.

వెతుకులాట..నెట్టింట్లో ఏదైనా వెతకాలంటే.. గూగుల్‌ల్లో సెర్చ్‌ చేస్తాం. ఇప్పుడు వాట్సాప్‌ కూడా పెద్ద సమాచార భాండాగారంలా మారింది. వందల్లో కాంటాక్ట్‌లు.. పదుల్లో గ్రూపులు..  రోజూ లెక్కకు మిక్కిలి షేరింగ్‌లు. మరైతే, కాంటాక్ట్‌లను సెర్చ్‌ ద్వారా వెతికినట్టుగానే షేరింగ్‌ల్లోని డేటాని సెర్చ్‌ చేయాలంటే? ప్రత్యేకంగా ‘సెర్చ్‌’ ఆప్షన్‌ ఉంది. ఎక్కడంటే.. ఏదైనా కాంటాక్ట్‌ని సెలెక్ట్‌ చేశాక కుడివైపు ఉండే మూడు చుక్కల్ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలో సెర్చ్‌ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేసి కీవర్డ్స్‌తో వెతకొచ్చు.

కీబోర్డులోనే ‘సెండ్‌’కంటెంట్‌ ఏదైనా.. వాట్సాప్‌లో పంపేందుకు సెండ్‌ ఆప్షన్‌ ప్రత్యేకంగా ఉంది. కీబోర్డులో మేటర్‌ టైప్‌ చేసి పైన ఉన్న సెండ్‌ ఆప్షన్‌ని నొక్కడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే కీబోర్డులోని ఎంటర్‌ బటన్‌ని ‘సెండ్‌’లా మార్చేస్తే! అందుకు సెట్టింగ్స్‌లోని ‘చాట్‌’ విభాగంలోకి వెళ్లండి. అక్కడ ‘ఎంటర్‌ ఈజ్‌ సెండ్‌’ ఆప్షన్‌ని చెక్‌ చేయండి. అంతే.. టైపింగ్‌ కీబోర్డులో సెండ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. వద్దనుకుంటే ఆప్షన్‌ని అన్‌చెక్‌ చేయండి.

పైనే పిన్‌ చేయొచ్చుఎక్కువగా ఏదైనా గ్రూపునో.. కాంటాక్ట్‌నో పదే పదే యాక్సెస్‌ చేస్తున్నట్లయితే వాటిని వెతుక్కోకుండా కాంటాక్ట్‌లకు పైన పిన్‌ చేసి పెట్టుకోవచ్చు. అందుకు ఏదైనా గ్రూపు లేదా కాంటాక్ట్‌లను ఒత్తి పట్టుకుంటే ‘పిన్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేస్తే ఎంపిక చేసుకున్నవి టాప్‌లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైనా వాటిని ‘అన్‌పిన్‌’ చేయాలనుకుంటే మళ్లీ ఒత్తి పట్టుకుంటే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఐఫోన్‌ యూజర్లు కాంటాక్ట్‌ లేదా గ్రూపుని కుడివైపునకు స్వైప్‌ చేయడం ద్వారా ‘పిన్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.

అవి బుక్‌మార్క్‌లే!బ్రౌజింగ్‌లో ఏవేవో వెబ్‌సైట్‌లు చూస్తుంటాం. కొన్నింటిని బుక్‌మార్క్‌ చేసుకుని తీరిగ్గా ఉన్నప్పుడు ఆయా వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేసి కావాల్సిన కంటెంట్‌ని తీసుకుంటాం. ఇదే మాదిరిగా వాట్సాప్‌లోనూ రోజూ ఎన్నో కాంటాక్ట్‌ల నుంచి ఏవేవో షేరింగ్స్‌ వస్తుంటాయ్‌. అన్నీ సవివరంగా చూడలేరు. అలాంటప్పుడు మీకు నచ్చిన వాటిని బుక్‌మార్క్‌ల్లా పెట్టుకుని సేవ్‌ చేస్తే! అందుకు ‘స్టార్డ్‌ మెసేజెస్‌’ ఆప్షన్‌ ఉంది. ఇది బుక్‌మార్క్‌ మాదిరే పని చేస్తుంది. డాక్యుమెంట్‌, ఇమేజ్‌, వీడియో.. ఏదైనా ముఖ్యమైనది కావచ్చు.. మరెప్పుడైనా చూద్దాం అనుకోవచ్చు.. అలాంటప్పుడు వాటిని సెలెక్ట్‌ చేస్తే ‘స్టార్డ్‌ మెసేజెస్‌’ (స్టార్‌ గుర్తు) ఆప్షన్‌ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేయండి. దీంతో మెసేజ్‌కి స్టార్‌ గుర్తు జత అవుతుంది. ఎప్పుడైనా ఆయా బుక్‌ మార్క్‌లను చూద్దాం అనుకుంటే.. కాంటాక్ట్‌లు, గ్రూపుల్ని సెలెక్ట్‌ చేసి  ‘వ్యూ కాంటాక్ట్‌’లోకి వెళ్లండి. అక్కడే స్టార్డ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. తాకితే బుక్‌మార్క్‌ పెట్టినవి కనిపిస్తాయి.

స్టోరేజ్‌ పర్యవేక్షణవాట్సాప్‌ డేటాతోనే ఫోన్‌ నిండిపోతున్న రోజులివి. అంతలా.. రోజూ వినియోగదారులు సమాచారాన్ని పంచుకుంటున్నారు. దానికి తోడు వై-ఫైకి కనెక్టు అవ్వగానే కొన్ని ఫైల్స్‌ ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్‌ అయిపోతుంటాయి. దీంతో యూజర్‌కి తెలియకుండానే ఫోన్‌లో మెమొరీ ఖాళీ అవుతుంది. తక్కువ మెమొరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌ల్లో అయితే పదే పదే ఇదో సమస్యగానూ మారుతుంది. మరైతే, మీ వాట్సాప్‌లో ఏయే కాంటాక్ట్‌లు ఎంతెంత మెమొరీ తీసుకున్నాయో ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలంటే? సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ‘డేటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్‌’ అప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్‌ చేసి ‘స్టోరేజ్‌ యూసేజ్‌’ని తాకండి. దీంతో మొత్తం జాబితా వస్తుంది. ఎక్కువ మెమొరీ తీసుకున్నవి పైన కనిపిస్తాయి. అక్కర్లేని డేటాని ఆయా కాంటాక్ట్‌లు, గ్రూపుల నుంచి తొలగించొచ్చు.
 
వాట్సాప్‌ డేటాని సింక్రనైజ్‌ చేయడం... 
పాత ఫోన్‌ని సిస్టంకి కనెక్ట్‌ చేసి ఇంటర్నల్‌ మెమొరీలోని వాట్సాప్‌ ఫోల్డర్‌ని సిస్టంలో కాపీ చేయాలి. తర్వాత కొత్త ఫోన్‌ని సిస్టంకి కనెక్ట్‌ చేసి కాపీ చేసిన వాట్సాప్‌ ఫోల్డర్‌ని ఫోన్‌ ఇంటర్నల్‌ మెమొరీలోకి కాపీ చేయాలి. తర్వాత ఫోన్‌ నంబర్‌తో వాట్సాప్‌లోకి లాగిన్‌ అయితే చాలు. కాంటాక్ట్‌లు, చాట్‌ మెసేజ్‌లు, గ్రూపులు, మీడియా ఫైల్స్‌.. అన్నీ వచ్చేస్తాయి. ఐఫోన్‌ వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌లోకి మొత్తం డేటాని బ్యాక్‌అప్‌ తీసుకున్నాక.. కొత్త ఫోన్‌లో లాగిన్‌ అయితే చాలు. వాట్సాప్‌ డేటా కూడా ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. క్లౌడ్‌ స్టోరేజ్‌ని వాడుకోవడం. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ డ్రైవ్‌లోకి డేటాని బ్యాక్‌అప్‌ తీసుకునే వీలుంది. అందుకు సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి ‘చాట్‌’లో కనిపించే ‘చాట్‌్ బ్యాక్‌అప్‌’ని వాడుకోవాలి. ఐఓఎస్‌ యూజర్లు ‘ఐక్లౌడ్‌’తో బ్యాక్‌అప్‌ తీసుకోవచ్చు. బ్యాక్‌అప్‌ తీసుకున్నాక  కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ లాగిన్‌ అయ్యేటప్పుడు క్లౌడ్‌ బ్యాక్‌అప్‌ని ఎంపిక చేసుకుని సింక్‌ చేయొచ్చు. అయితే, క్లౌడ్‌ నుంచి బ్యాక్‌అప్‌ తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ‘రీస్టోర్‌’ ఆప్షన్‌ ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్‌ నుంచి ఐఓఎస్‌ని మారుతున్నట్లయితే డేటాని రికవర్‌ చేయడం సాధ్యం కాదు. కేవలం కాంటాక్ట్‌లు, గ్రూపులు మాత్రమే రీస్టోర్‌ అవుతాయి.

Comments