మనం ఇంటర్నెట్ స్పీడ్ ని చెక్ చేయడానికి రకరకాల ఆప్స్ మరియు వెబ్ సర్వీసెస్ ని వాడుతూ ఉంటాం. వీటిలో Speedtest.com, Fast.com వంటివి ముఖ్యమైనవి. అయితే టెలికాం అథారిటీ అఫ్ ఇండియా వారి MYSpeed(TRAI) ద్వారా కూడా డేటా స్పీడ్ ని చెక్ చేయవచ్చు.
ఇప్పుడు ట్రాయ్ MYSpeed ఆప్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ని ఎలా చెక్ చెయ్యాలో వివరంగా చూద్దాం.
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి MYSpeed(TRAI) ఆప్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చెయ్యండి.
తరువాత లొకేషన్, ఫోన్ కాల్స్, కాంటాక్ట్స్ వంటి ముఖ్యమైన పర్మిషన్స్ ని Allow చెయ్యండి.
ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేయడానికి క్రింద నున్న Begin Test బటన్ ని క్లిక్ చెయ్యండి.
ప్రాసెస్ పూర్తయిన తరువాత స్పీడ్ టెస్ట్ రిజల్ట్స్ ని చూడవచ్చు.
అయితే ఎడమవైపు క్రిందనున్న మూడు బార్స్ ని క్లిక్ చేసి రిజల్ట్స్ సెక్షన్ కి వెళ్ళవచ్చు. ఇక్కడ అన్ని స్పీడ్ టెస్ట్ రిజల్ట్స్ ని చూడవచ్చు. ఏదైనా రిజల్ట్ పై క్లిక్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ చూడవచ్చు
అంతేకాక నెట్వర్క్ స్పీడ్ లాగ్, కవరేజ్, డివైస్ లొకేషన్ వంటివి TRAI కి షేర్ చేయవచ్చు.
Comments
Post a Comment