ఈ రోజుల్లో అందరు డిజిటల్ payments ఎక్కువగా చేస్తున్నారు అందులో బాగా పేరు గాంచినది అలాగే అందరు ఎక్కువగా వాడేది PAYTM అప్లికేషన్. ఈ Paytm అప్లికేషన్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు.
మోసం ఎలా జరుగుతుంది.
సాదారణంగా మనం paytm పేమెంట్ చేసిన తరువాత ఇదిగో పేమెంట్ చేసాం అయిపోయింది చూసుకోండి అని పేమెంట్ కంప్లీట్ అయిన పిక్చర్ చూపిస్తాం కదా సరిగ్గా ఇలాగే పేమెంట్ కంప్లీట్ అయిన నకిలీ ఫోటోలని చూపించి తప్పించుకుంటున్నారు. అయితే ఇది ఎలా సాద్యమౌతుందో తెలుసా…? Paytm Spoof అనే అప్లికేషన్ ద్వారా ఇలా చేస్తున్నారు.
ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి.
కాబట్టి మీరు ఇలాంటి మోసానికి గురి కాకుండా చూసుకోండి. అలా ఉండాలి అనుకుంటే మీరు పేమెంట్ కంప్లీట్ అని చెప్పిన వెంటనే మీ sms చెక్ చేసుకోండి ఒక వేల మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే మీ paytm అప్లికేషన్ లో లాగిన్ అయి చెక్ చేసుకోండి తస్మాత్ జాగ్రత్త.
Comments
Post a Comment