తెలియని కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు, రూట్ కోసం చాలామంది జీపీఎస్ అప్లికేషన్లు వాడుతూ ఉంటారు. దీనికోసం అధిక శాతం ఉంది గూగుల్ మ్యాప్స్ వాడడం సహజం.
అయితే మరికొంతమంది, అంత కన్నా భిన్నమైన అప్లికేషన్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిద్దామని గూగుల్ ప్లే స్టోర్ లో అనేక ఇతర అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి థర్డ్-పార్టీ యాప్స్ అన్ని సురక్షితమైనవి కాదు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్ లో చలామణి అవుతున్న పది ఫేక్ జిపిఎస్ యాప్స్‌ని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ESET వెలుగులోకి తీసుకువచ్చింది.
ఇవి పేరుకి పూర్తిస్థాయి అప్లికేషన్లుగా స్క్రీన్ షాట్ లను ప్రదర్శించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే వాటిని ఇన్స్టాల్ చేసుకున్న వారికి, చీటికిమాటికి స్క్రీన్ మీద అడ్వర్టైజ్మెంట్లు చూపించడంతో పాటు, స్వయంగా ఎలాంటి మ్యాప్ సదుపాయం కలిగి లేకపోవడం గమనార్హం. దీనికి బదులుగా గూగుల్ మ్యాప్ API ఆధారంగా యాప్ ఓపెన్ చేసిన కొద్దిసేపటి తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, దానిద్వారా నావిగేషన్ చూపిస్తున్నాయి.
గూగుల్ ప్లేస్టోర్ నియమాల ప్రకారం, ఇలా వేరే యాప్ APIని దాన్ని అనుమతి లేకుండా యాక్సెస్ చేయడం నిషిద్ధం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ యాప్స్‌ని డెవలప్ చేసినది అధిక శాతం మంది భారతీయులు కావడం విశేషం. అవి ఫేక్ జిపిఎస్ అప్లికేషన్లు అన్న విషయం తెలియక చాలా మంది వినియోగదారులు వాటిని రేటింగ్ కూడా ఇస్తున్నారు, రివ్యూలూ రాస్తున్నారు. ప్రస్తుతానికి ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో కొనసాగుతూనే ఉన్నాయి. గూగుల్ సంస్థ రాబోయే ఒకటి రెండు రోజుల్లో వీటిని తొలగించే అవకాశం ఉంది.
ఆ నకిలీ అప్లికేషన్ల పేర్లు ఇవి:
- GPS Maps, Route Finder – Navigation, Directions
- GPS, Maps & Navigation
- GPS Route Finder – GPS, Maps, Navigation & Traffic
- GPS, Maps, Navigations – Area Calculator
- GPS , Maps, Navigations & Directions
- Maps GPS Navigation Route Directions Location Live
- Live Earth Map 2019 – Satellite View, Street View
- Live Earth Map & Satellite View, GPS Tracking
- Traffic Updates: GPS & Navigation
- Free-GPS, Maps, Navigation, Directions and Traffic
- Voice GPS Driving Directions, Gps Navigation, Maps
- GPS Live Street Map and Travel Navigation
- GPS Street View, Navigation & Direction Maps
- GPS Satellite Maps
- Free GPS, Maps, Navigation & Directions
- Maps & GPS Navigation: Find your route easily!
- Voice GPS Navigation Maps Driving
- GPS Navigation & Tracker
- GPS Voice Navigation Maps, Speedometer & Compass
Courtesy : Computer Era
Comments
Post a Comment