
యాపిల్ ‘నోట్స్’
ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్.. దేంట్లోనైనా చకచకా నోట్స్ రాసుకునేందుకు తగిన యాప్ Bear. యాపిల్ ఉత్పత్తులకు ప్రత్యేకం. డైరీలా రోజువారీ పనులను రాసుకోవచ్చు. ఆలోచన ఏదైనా అక్షర రూపం ఇవ్వొచ్చు. షాపింగ్‌కి వెళ్లే ముందు సరకుల జాబితాని సిద్ధం చేసుకోవచ్చు. మ్యాక్‌బుక్‌లో రాసిన నోట్స్‌ని ఐప్యాడ్‌లో చూడొచ్చు. ఫోన్‌లో యాక్సెస్ చేయొచ్చు.ఇలా అన్నింటిలోకి డేటాని సింక్ చేస్తుంది.
* డౌన్‌లోడ్ లింక్: Bear
ఇంగ్లిష్‌పై పట్టు
మాతృభాష తర్వాత కచ్చితంగా నేర్చుకోవాల్సింది ఆంగ్లం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారికి ప్రత్యేకం Hello English: Learn English యాప్. మీకు వచ్చిన మాతృభాషలోనే ఇంగ్లిష్ నేర్చుకునేలా యాప్‌ను రూపొందించారు. ‘ఆడియో డిక్షనరీ’లోకి వెళ్తే పదాల్ని ఎలా పలకాలో వినొచ్చు. పజిల్ గేమ్స్ ఆడుతూ కొత్త పదాల్ని నేర్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రత్యేకం.
* డౌన్‌లోడ్ లింక్: Hello English: Learn English
వాడకంపై నిఘా
నిద్ర లేవడంతోనే ఫోన్ అందుకుంటాం. అది మొదలు రోజంతా స్మార్ట్ ఫోన్‌తో ఎంత సమయం గడుపుతున్నారు? ఎన్ని సార్లు ఫోన్‌ని అందుకున్నారు? ఏయే యాప్‌లకు ఎంతెంత సమయం కేటాయించారు?... లాంటి మరిన్ని వివరాల్ని రోజూ ట్రాక్ చేసేందుకు Moment – Screen Time Tracker యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. పిల్లలు ఎంత సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారో తెలుసుకునేందుకు తగిన యాప్. ఇన్‌స్టాల్ చేశాక యాప్ కనిపించకుండా పని చేస్తుంది. ఆండ్రాయిడ్, యాపిల్ వినియోగదారులు వాడుకోవచ్చు.
* డౌన్‌లోడ్ లింక్: Moment – Screen Time Tracker
మాటలు మేటర్‌లా..
వాయిస్ రికార్డింగ్ చేస్తాం. అవసరం వచ్చినప్పుడు వింటాం. అయితే, మాట్లాడేది కేవలం వాయిస్‌లా మాత్రమే కాకుండా టెక్స్ట్ మేటర్‌లా కన్వర్ట్ అయితే? Otter Voice Notes యాప్‌తో ఇది సాధ్యమే. ఇంగ్లిష్ భాషని మాత్రమే సపోర్టు చేస్తుంది. ఉచితంగా నెలలో 600 నిమిషాల క్లౌడ్ స్పేస్‌ని వాడుకోవచ్చు. ఇలా రికార్డు చేసిన ఫైల్స్‌ని షేర్ చేయొచ్చు. విద్యార్థులు తరగతి గదిలో బోధనల్ని రన్నింగ్ నోట్స్‌లా భద్రం చేసుకునేందుకు తగిన యాప్. ఆండ్రాయిడ్, యాపిల్ ఓఎస్‌లను సపోర్టు చేస్తుంది.
బొమ్మలేయండి
ఫోన్ తెరపై బొమ్మలేయాలంటే? స్టైలస్ ఉండాల్సిందే అనుకుంటాం అందరం. అయితే, స్టైలస్‌తో పని లేకుండా ఐఫోన్‌లో బొమ్మలేయొచ్చు. అందుకు ప్రత్యేకమైందే Procreate Pocket యాప్. సుమారు 135 రకాల బ్రష్‌లు ఉన్నాయి. అనువైన వాటిని సెలెక్ట్ చేసి బొమ్మలు గీయడమే. యాపిల్ యూజర్లకు ప్రత్యేకం.
Comments
Post a Comment